ఆంధ్రప్రదేశ్‌

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 19: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని.. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు, పశుపక్ష్యాదులతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరు సుఖశాంతులతో జీవించేలా చూడాలని స్వామి, అమ్మవార్లను ప్రార్ధించానని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవాదాయ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా తొలిసారిగా శ్రీవారిని, అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. బుధవారం తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కమిట్‌మెంట్ ఉన్న నేత అన్నారు. ప్రజల ఆలోచనలతో ముందుకు వెళుతున్నారని, వారం రోజుల పాలనను ప్రజలందరు చూశారన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరు అభివృద్ధి చెందాలని, అన్ని ఆలయాల్లో పవిత్రత వెల్లువెత్తాలనేదే తన కోరిక అన్నారు. రాష్ట్రంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, దేవాలయాల భూముల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే రాష్టవ్య్రాప్తంగా ఉన్న దేవాలయాల్లో వంశపారంపర్యంగా వచ్చే అర్చకత్వంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిష్తామన్నారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సిన పరిస్థితి కనపడుతోందన్నారు. తన తదుపరి పర్యటనలో ఆలయ ఆభరణాల విషయంపై అధికారులతో సమీక్షిస్తామన్నారు. ఇందులో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒక ప్రభుత్వం పడిపోయినపుడు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలకమండలి చైర్మన్, సభ్యులు కూడా నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు.
అయితే కొంతమంది పదవులకు రాజీనామా చేయకుండా భీష్మిస్తున్నారని, ఆర్డినెన్స్ ద్వారా వాటిని రద్దు చేయాలని కేబినెట్ సమావేశం నిర్ణయించిందన్నారు. బంగారం తరలింపునకు సంబంధించి విచారణ జరిపిస్తామని, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మారే మనిషి కాదని, ఆయన గ్యాంగ్ కూడా మారదన్నారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేకపోవడం వల్లే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని విమర్శించారు. తమ పరిపాలనా విధానం వేరని, వారి పాలనా విధానం వేరన్నారు. తమ అభిప్రాయాలు, వారి అభిప్రాయాలు వేరని, గౌరవంగా పాలకమండలి వైదొలిగితే మంచిదని హితవు పలికారు. త్వరలోనే పాలకమండళ్లు రద్దు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.