ఆంధ్రప్రదేశ్‌

దేదీప్యమానంగా పుష్కర ఘాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 8: కృష్ణా పుష్కరాల్లో ప్రధానంగా పవిత్ర స్నానమాచరించే వారికోసం కోట్లాది రూపాయలతో నిర్మితమైన స్నాన ఘట్టాలు విద్యుత్ కాంతులతో ధగద్ధగాయమానంగా వెలుగులీనుతున్నాయి. వీటిని అందమైన టైల్స్‌తో తీర్చిదిద్దటంతో తిలకించేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివస్తూ మెట్లపై కూర్చుని గ్రూప్ ఫొటోలు దిగుతున్నారు. మరోవైపు శాశ్వత ప్రాతిపదికన ప్రకాశం బ్యారేజీకి 6 కోట్ల రూపాయల వ్యయంతో ఎగువ, దిగువన 666 ఎల్‌ఇడి ఆర్‌జిఎం విద్యుత్ దీపాలను అమర్చారు. ముంబైకి చెందిన విన్‌సెమి కండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వీటిని అమర్చింది. డిఎంఎస్ కంట్రోల్ విధానంలో అన్ని దీపాలూ ఒకేసారి వివిధ రంగులు విరజిమ్ముతుంటే వాటిని చూస్తున్నవారు పరవశించిపోతున్నారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ కనీసం పాదచారులను కూడా బ్యారేజీ పైకి అనుమతించకుండా ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన వెంట వచ్చే వివిఐపిలు, విఐపిల రాకపోకలకే ప్రకాశం బ్యారేజీని పరిమితం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 91 ఘాట్లు నిర్మించగా, వీటిల్లో 11 పొడవైనవి, 22 ప్రధాన ఘాట్లు వున్నాయి. వీటిల్లో విజయవాడ నగర పరిధిలో 17 వుంటే, రూరల్‌లో 74 ఘాట్లు ఉన్నాయి. అన్ని స్నానఘాట్లలో ఓవైపు సిసి కెమెరాలు, మరోవైపు హైమాస్ట్ లైట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అక్కడికి సేదతీరటానికి వచ్చే నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.