తూర్పుగోదావరి

క్విట్ బిజెపి,టిడిపి...సేవ్ ఎపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: స్వాతంత్య్ర సంగ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎపికి ప్రత్యేకహోదా అడ్డుకుని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న టిడిపి, బిజెపిలను తరమికొట్టాలని, ఎపిని రక్షించాలన్న నినాదంతో క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాజమహేంద్రవరంలో పాదయాత్రను నిర్వహించనున్నట్లు డిసిసి అధ్యక్షుడు కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం ఉదయం 10.30గంటలకు స్థానిక కోటగుమ్మం నుంచి డీలక్స్‌సెంటర్ వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. సోమవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను పార్లమెంటులో ప్రత్యేకహోదాపై బిజెపి ఆడుతున్న నాటకాన్ని కళ్లారా చూశానన్నారు. ప్రత్యేకహోదాకు దేశంలోని 11 పార్టీలు మద్దతు ఇచ్చినా బిజెపి మాత్రం హోదా రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ అభిజిత్‌సేన్ కూడా ప్రత్యేకహోదాపై ఆర్థిక సంఘం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారన్నారు. ఈనేపథ్యంలో ప్రజలను మోసం చేసిన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బిజెపి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా సంజీవని కాదని చెబుతున్న కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన సందర్భంగా యుపిఏ ప్రభుత్వం ఐదేళ్లు ప్రత్యేకహోదా ప్రకటిస్తే తాము అధికారంలోకి వచ్చిన తరువాత పదేళ్లు ఇస్తామని ఎలా ప్రకటించారని నిలదీశారు. తాను రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం లేదని చెప్పుకుంటున్న వెంకయ్యనాయుడుకు రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి కూడా రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం ఇష్టం లేదని, అందుకే ఆపార్టీకి చెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీలోగా రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. రాజీవ్‌గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మరణించిన శ్రీపెరంబదూరు నుంచి డిల్లీ వరకు సుమారు 250 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన రాజీవ్ సద్భావన యాత్ర బుధవారం రాజమహేంద్రవరం చేరుకుంటుందని దుర్గేష్ చెప్పారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడైన బోడా వెంకట్‌ను ఈసందర్భంగా అభినందించారు. ఈసమావేశంలో కాంగ్రెస్ నాయకులు మార్టిన్‌లూథర్, రామినీడి మురళి, ఎన్‌వి శ్రీనివాస్ పాల్గొన్నారు.