ఆంధ్రప్రదేశ్‌

సుపరిపాలన అందించనున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, జూన్ 23 : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అత్యంత సుపరిపాలన అందిస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నూతన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు త్వరగా దర్శనం కల్పించేలా అత్యంత ప్రాముఖ్యత కల్పిస్తామన్నారు. కడప జిల్లా వేంపల్లె మండల పరిధిలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద ఆదివారం తితిదే నూతన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తాను శనివారం ప్రమాణ స్వీకారం చేశానన్నారు. చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే బయల్దేరి మొట్టమొదటి సారిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపాయకు వచ్చానన్నారు. సీఎం జగన్, శ్రీవేంకటేశ్వరస్వామి కృపతో తితిదే చైర్మన్ బాధ్యతలు చేపట్టానన్నారు. జగన్ పాలన మహానేత వైఎస్ పాలన కంటే మెరుగ్గా ఉండాలని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నానన్నారు. తిరుమల వెంకన్న ప్రతిష్టను పెంచేలా తాను తన నూతన కార్యవర్గ సభ్యులు పని చేస్తారన్నారు. భక్తులు దేవుడికిచ్చే కానుకల్లో ఏ ఒక్కటీ దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వరస్వామి నగల అపహరణపై వచ్చిన పలు విషయాలను ఆయన ప్రస్తావిస్తూ తప్పుచేసిన ఏ వ్యక్తినీ తిరుమల వెంకన్న వదిలిపెట్టరని, కఠినంగా శిక్షిస్తారన్నారు. తితిదే మరింత అభివృద్ధి చెందేందుకు పాటుపడతానన్నారు. ఆయన వెంట కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి, వైసీపీ నాయకులు ఉన్నారు.
చిత్రం...ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తున్న తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి