ఆంధ్రప్రదేశ్‌

ప్రతి సోమవారం ‘స్పందన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: సామాన్య మానవులు కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు అందుబాటులో లేరని తిప్పి పంపుతున్నారు.. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కారాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉండవల్లి ప్రజావేదికలో సోమవారం ఉన్నతాధికారులు, కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ప్రతి సోమవారం కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్ మాదిరిగానే అన్ని కార్యాలయాల్లో ‘స్పందన’ పేరిట ఫిర్యాదులను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ఆ రోజున ఎలాంటి సమీక్షలు నిర్వహించ రాదన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చే ప్రతి బాధితుడికి రసీదు ఇచ్చి మొబైల్ నెంబర్ సేకరించి ఎంత వ్యవధిలో సమస్య పరిష్కరిస్తారో చెప్పాలన్నారు. వచ్చిన ఫిర్యాదులు.. పరిష్కరించిన వాటిపై కనీసం నెలకోసారి కలెక్టర్లు సమీక్షించాలన్నారు.
‘స్పందన’ ద్వారా పరిష్కరించిన సమస్యలపై ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా స్వయంగా పర్యవేక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు ఇచ్చిన రసీదులను గ్రామసభలో తానే స్వయంగా తనిఖీ చేస్తానన్నారు. ప్రతి శుక్రవారం కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల స్థితిగతులపై చర్చించాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తే సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు పై అధికారులపై అభియోగాలు మోపే పరిస్థితి మారాలన్నారు. కింది స్థాయి సిబ్బందిని సంతృప్తి పరచలేని అధికారులు ప్రజలను ఎలా సంతృప్తిపరుస్తారని ప్రశ్నించారు. ఐఏఎస్‌లు గ్రామాలకు వెళ్లి నిద్రించినప్పుడు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలుస్తుందన్నారు.
మరుగుదొడ్లు సక్రమంగా ఉన్నాయో లేదో పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు అందుతున్నాయా హాస్టళ్ల నిర్వహణ ఎలా ఉంది.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు ఎలా ఉన్నాయనే విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవటంతో పాటు గ్రామస్థుల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించే వీలుంటుందని తెలిపారు.
నవరత్నాలు ఎలా అమలవుతున్నాయో తెలుస్తుందన్నారు. హాస్టళ్లు, ఆసుపత్రులలో సౌకర్యాలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు వారంలో ఒకరోజు కలెక్టర్లు పల్లెనిద్ర చేపట్టాలన్నారు. విద్య, వైద్యం పేదలకు ఎలా అందుతున్నాయనేది ప్రత్యక్షంగా గుర్తించాలన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా హాస్టళ్లు, ఆస్పత్రులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పల్లెలో నిద్రించాలని ఆ మరుసటి రోజు ఉదయం ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. జిల్లా పోర్టల్‌లో ప్రతి ఒక్క ఫైల్‌ను అనుసంధానం చేయాలన్నారు. గ్రామ, మడల స్థాయి నుంచి కలెక్టర్ వరకు జ్యుడీషియరీ, పోలీస్ ఎఫ్‌ఐఆర్ అన్నీ ఇందులో పొందు పరచాలన్నారు. జిల్లాలో చేపట్టిన పని విలువ, కాంట్రాక్టర్ ప్రారంభించిన తేదీ.. పూర్తయ్యే గడువు.. అన్నీ పారదర్శకంగా అందుబాటులోకి తేవాలన్నారు.
ప్రతి గ్రామంలో భూములపై ఆడిట్ నిర్వహించి ప్రభుత్వ, ప్రైవేట్ భూముల లభ్యతను తేల్చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ స్థలాలు మంజూరు చేసిందని, అయితే అవి ఎక్కడ ఉన్నాయో లబ్ధిదారులకు తెలీదన్నారు. వచ్చే ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. అదే రోజున రిజిస్ట్రేషన్లు ఓ పండుగలా జరపాలన్నారు.
జిల్లాల వారీగా ప్రభుత్వ భూమి ఎంత ఉందనేది గుర్తించి అవసరమైతే ప్రైవేటు భూములు కొనుగోలు చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో వౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల కనుగుణంగా స్వచ్ఛత పాటించి మోడల్ మునిసిపాలిటీలుగా రూపు దిద్దుకునేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రజల్లో విశ్వసనీయత పెంచుకునేందుకు అంకితభావంతో పనిచేయాలని హితవు పలికారు.