ఆంధ్రప్రదేశ్‌

థింసాకు కూచిపూడి తరహా గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 9: గిరిజనుల సంప్రదాయ నృత్యం ‘్థంసా’కు కూచిపూడి తరహాలో ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా అరుకులో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ థింసా నృత్యానికి గుర్తింపును కల్పించడం ద్వారా గిరిజన సంస్కృతికి ప్రాధాన్యత నిస్తూనే గిరిజనులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో గిరిజనులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించట్లేదని, మన రాష్ట్రంలో గిరిజనులకు గుర్తింపునిచ్చి, వారి అభ్యున్నతికి చేయూతనిస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే ఆదివాసీ దినోత్సవాన్ని అరకులోనే నిర్వహించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఏడాది తరువాత తాను ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తానని, ఇప్పుడు ఏదైతే హామీలిచ్చామో అవన్నీ అమలయ్యేందుకు కృషి చేస్తానన్నారు. గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విశాఖ ఏజెన్సీలో రూ.526 కోట్లతో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా 10 ఏకలవ్య పాఠశాలను ఏర్పాటు చేశామని, మరో 12 ఎకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. అలాగే ప్రస్తుతం ఏజెన్సీలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ హాస్టళ్లన్నింటినీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అరకు ఏజెన్సీ పరిసరాల్లో విస్తారంగా ఉన్న వనరులను గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసమే వినియోగిస్తామన్నారు. గిరిజనుల హక్కులను కాపాడుతూనే ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు