ఆంధ్రప్రదేశ్‌

జగన్ దుర్నీతికి నిదర్శనం: మంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 25: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం భద్రత కుదించడం ముఖ్యమంత్రి జగన్ దుర్నీతికి నిదర్శనమని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. మంగళవారం గుంటూరులోనీ టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశీ పర్యటన ముంగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు కుటుంబానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భద్రత తొలగించడం రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమేనన్నారు. చంద్రబాబు నాయుడిపై కక్షపూరిత ధోరణితో ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజావేదిక కూల్చివేత, భద్రత కుదింపు వంటి అంశాలే ఇందుకు నిదర్శనమన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వారి కుటుంబానికి పూర్తి భద్రత కల్పించి, పాదయాత్రకు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. నేడు జడ్ కేటగిరి భద్రత ఉన్న మాజీ మంత్రి లోకేష్‌కు భద్రత తగ్గించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రతిపక్ష నాయకుడి కుటుంబానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందన్నారు. జడ్ కేటగిరిలో ఉన్న వారికి ఏ విధంగా భద్రత తగ్గిస్తారని ప్రశ్నించారు. సంఘ విద్రోహ శక్తులు బాబు కుటుంబాన్ని టార్గెట్ చేసే ప్రమాదం ఉందని, ఈ దృష్ట్యా వారి కుటుంబానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేశారు. లేకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.