రాష్ట్రీయం

మోదీ మినహా మరో నేతను ప్రజలు గుర్తించడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ మినహా మరో నాయకుడిని గుర్తించటం లేదని, మోదీ అడుగుజాడల్లో నడిచేందుకు నాయకులంతా ముందుకు వస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ఒక హోటల్‌లో అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మంగళవారం సాయంత్రం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో మోదీని గెలిపించడం ద్వారా దేశంలో మోదీ తప్ప మరో వ్యక్తి నాయకత్వాన్ని ప్రజలు గుర్తించలేదని తేలిందన్నారు. అవినీతి రహిత పాలన, అభివృద్ధి, పేదరిక నిర్మూలన తన వల్లే సాధ్యమవుతుందని 2014 పాలన ద్వారా మోదీ నిరూపించారన్నారు. 2014 నుంచి మోదీ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయ చేస్తుంటే ఏమీ ఇవ్వలేదని టీడీపీ దుష్ప్రచారం చేసిందన్నారు. కాని 2019 ఎన్నికల్లో ప్రజలు ఈ దుష్ప్రచారాన్ని అసత్య ప్రచారంగా నమ్మి టీడీపీని ఓడించారన్నారు. నేడు మోదీ ఒక్కరే ఈ దేశాన్ని ముందుకు తీసుకెల్లగలరని భావించిన నేతలంతా భాజపాలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రానికి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పార్టీలో చేరారన్నారు. అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి వజ్రాల భాస్కరరెడ్డి 100 మంది అనుచరులతో పార్టీలో చేరుతున్నారని, వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. వజ్రాల భాస్కరరెడ్డి, ఆయన అనుచరులకు పార్టీ కండువాలను కప్పి భాజపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వజ్రాల భాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ సుపరిపాలన, దేశాభివృద్ధి, క్రమశిక్షణ, వ్యక్తిత్వానికి ప్రభావితుడునై భాజపాలోకి చేరుతున్నట్లు చెప్పారు. మోదీ అడుగుజాడల్లో నడుస్తూ దేశాభివృద్ధికై పని చేస్తానన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుల కన్నా లక్ష్మీనారాయణ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ తనకు 2000 నుంచి తెలుసని, ఆయన నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు. వేదికపై ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన పర్వ్-2019 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక చుట్టుగుంటలోని లైన్స్‌క్లబ్ హాలులో కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్, మాజీమంత్రి మాణిక్యాలరావు అధ్యక్షతన సంఘటన పర్వ్-2019 సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. జూలై 6వ తేదీ నుండి ప్రారంభం అయ్యే భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా మండల ప్రముఖ్, సహ ప్రముఖ్‌లను పిలుపునిచ్చారు. బూత్‌స్థాయిలో జరగనున్న ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభం కానుందన్నారు. మోదీ నాయకత్వాన్ని బలపర్చేందుకు యువత ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని వారిని పార్టీలోకి ఆహ్వానించాలని, అందుకు సభ్యత్వ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. సమావేశానికి హాజరైన భాజపా ఆంధ్రప్రదేశ్ సహా ఇన్‌చార్జ్ సునీల్ డియోధర్, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జి పురందేశ్వరి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సూచనలనిచ్చి నేతలకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం, ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి, కోశాధికారి, సన్యాసిరాజు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సోషల్ మీడియా కో-కన్వీనర్లు పాల్గొన్నారు.
చిత్రాలు.. అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, *సభ్యత్వ ప్రముఖ్‌ల సమావేశంలో మాట్లాడుతున్న కన్నా