ఆంధ్రప్రదేశ్‌

29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త జాబ్‌మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటికే సమ్మర్ ఇంటర్న్‌షిప్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సర్ట్ఫికేషన్ కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర నిరుద్యోగ యువత కూడా హాజరుకావచ్చన్నారు. ఈ నెల 29న విజయవాడలోని కేబీఎన్ కళాశాల, కడపలో కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కాలేజీ, ఏలూరులో సీఆర్ రెడ్డి కాలేజీ, నెల్లూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ మేళాలు నిర్వహిస్తారు. ఇక 30వ తేదీన విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్శిటీలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ సీమెన్స్ సెంటర్‌లో, తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో, విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తి చేసినవారంతా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.