ఆంధ్రప్రదేశ్‌

విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 12 సభ్యులతో ఒక నిపుణుల కమిటీని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా రంగంలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టేందుకు వీలుగా విద్యా విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేసేందుకు ఈ కమిటీని నియమించారు. కమిటీకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సు (బెంగళూరు)కు చెందిన ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా ప్రొఫెసర్ దేశాయ్ (ఐఐటి, హైదరాబాద్), ప్రొఫెసర్ జంధ్యాల బీజీ నాయక్ (ఎన్‌ఐఈపీ మాజీ వీసీ), డాక్టర్ ఆర్.వెంకట రెడ్డి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా నారాయణ మూర్తి, ఉన్నత విద్యా మండలి మాజీ వీవీ ఎన్.రాజశేఖర రెడ్డి, సామాజిక ఉద్యమకారుడు ఎస్. రామకృష్ణంరాజు, విద్యా సంస్థల ప్రతినిధి ఆలూరి సాంబశివ రెడ్డి, బి.ఈశ్వరన్, డీవీఆర్‌కే ప్రసాద్, మెంబర్ కన్వీనర్‌గా పాఠశాల విద్య సెక్రటరీ వ్యవహరిస్తారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణ, విద్యా ప్రమాణాల నాణ్యత, ఉపాధ్యాయుల, లెక్చరర్ల సర్వీస్ నిబంధనలపై అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేయటం ఈ కమిటీ ప్రాథమిక లక్ష్యం. రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల పనితీరును కమిటీ అధ్యయనం చేస్తుంది. వివిధ యాజమాన్యాల కింద పని చేస్తున్న విద్యా సంస్థల పనితీరును అధ్యయనం చేసి విద్యా వ్యవస్థ బలోపేతానికి, నాణ్యత పెంపునకు సిఫారసులు చేయాల్సి ఉంటుంది. ఫీజుల క్రమబద్ధీకరణకు, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా సంస్థలో సుస్థిర ప్రమాణాల సాధనకు వౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పనకు సూచనలు చేయాలి. కేంద్ర మానవ వనరుల శాఖ రూపొందించిన విద్యా విధానం ముసాయిదాకు అనుగుణంగా కే-12 విధానం అమలుకు సూచనలు తదితర అంశాలపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్సు కింద యుద్ధప్రాతిపదికన ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే అమలు చేసేందుకు వీలుగా సిఫారసులు ఉండాలి.