ఆంధ్రప్రదేశ్‌

మెరిట్ ప్రాతిపదికన గ్రామ వలంటీర్ల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూన్ 25 : గ్రామ వలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వలంటీర్లను ఇంటర్వ్యూ ప్రాతిపదికన కాకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేయాలన్నారు. ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉద్యోగాలు రాక గ్రామ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. విద్యార్హతను బట్టి మెరిట్ ప్రాతిపదికన గ్రామ వలంటీర్ల నియామకాలు చేపడితే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. వారిని చిరు ఉద్యోగిగా చూడాలే కానీ వైఎస్‌ఆర్ పార్టీ రాజకీయ వలంటీర్లుగా మార్చవద్దన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు, ఎంపికైన వారి వివరాలు, గ్రామ పంచాయతీల్లో ఉంచాలని ఆయన సూచించారు. ప్రభుత్వం వలంటీర్ల నియామకానికి విడుదల చేసిన జీఓ పారదర్శకంగా లేదన్నారు. గవర్నర్ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత జీఓను రద్దు చేసి అందులో రిజర్వేషన్లు సైతం అమలు చేయాలని రఘువీరా కోరారు.