ఆంధ్రప్రదేశ్‌

బాబు కుటుంబానికి భద్రత తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత తగ్గించింది. రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ ఇప్పటికే భద్రత తగ్గించారు. ఆయన కాన్వాయ్ నుంచి ఎస్కార్ట్ వాహనం, పైలట్ క్లియరెన్సు వాహనం తొలగించారు. చంద్రబాబు కుమారుడు, ఎమ్మెల్సీ లోకేష్‌కు కూడా జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. దీని కింద 5+5 గన్‌మెన్‌లను ఏర్పాటు చేస్తారు. అయితే ప్రస్తుతం దానిని 2+2కు కుదించారు. మిగిలిన ఇతర కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రత తొలగించారు. అయితే కనీస సమాచారం ఇవ్వకుండా భద్రత తొలగించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.