ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర విభజన తరువాత ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర విభజన తరువాత ఏపీ పోలీసులు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఈ సవాళ్లు అందరికీ తెలిసినవేనని, రాష్ట్ర విభజన తరువాత ఈ సవాళ్లు మరింత తీవ్రతరమైనాయన్నారు. చాలా కీలకమైన సంస్థలను హైదరాబాద్‌లో వదిలి వచ్చామని గుర్తు చేశారు. శాంతిభద్రతల ద్వారానే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమన్నారు. ఉండవల్లి ప్రజావేదికలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో భాగంగా మంగళవారం శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష ప్రారంభానికి ముందు డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ పోలీసు ట్రైనింగ్ అకాడమీ, ఫోరెన్సిక్ సైన్సస్ ల్యాబ్, గ్రేహండ్, అక్టోపస్ వంటి తీవ్రవాద వ్యతిరేక శిక్షణ సంస్థలు లేవన్నారు. ఇది రాష్ట్ర పోలీస్‌ను ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టిందన్నారు. విభజన హామీల మేరకు కొత్తగా ఆరు ప్రత్యేక రిజర్వు బెటాలియన్లు, రెండు ఎన్టీఆర్‌ఎఫ్ బెటాలియన్లు రావాల్సి ఉందన్నారు. అవి ఇంత వరకూ ఏర్పాటు కాలేదన్నారు.
ఒక్కో బెటాలియన్ ఏర్పాటుకు కేంద్రం 84 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందన్నారు. సమాజాభివృద్ధికి శాంతి, భద్రతలు చాలా కీలకమన్నారు. రాష్ట్రం సుస్థిర అభివృద్ధి సాధించేందుకు వీలుగా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దుతామన్నారు. నక్సలిజం, కుల, మతాల మధ్య ఘర్షణలు, అభివృద్ధి కారణంగా నిర్వాసితులు కావడం, ప్రముఖుల భద్రత, ఫ్యాక్షనిజం, రాజకీయ అస్థిరత వంటివి శాంతిభత్రలకు విఘాతం కల్గిస్తాయన్నారు. రాష్ట్రంలో వామపక్ష ఉగ్రవాదం సంప్రదాయంగా ఒడిశా సరిహద్దులోని ఐదు జిల్లాల్లో ఉందని, ఇటీవల కాలంలో చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని చింతూరు డివిజన్‌లో కూడా కొత్తగా మొదలైందన్నారు. ఇదే కాకుండా రాష్ట్రంలోని దాదాపు అన్ని పట్టణ ప్రాంతాల్లో వామపక్ష ఉగ్రవాదానికి అనుబంధంగా అనేక సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. వామపక్ష ఉగ్రవాదం, మావోయిస్టులు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తుంటారని, అందువల్ల పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి కంటే ఒక అడుగు ముందుగా ఉండటం అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వామపక్ష ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఏపీ పోలీసులకు ఘనమైన వారసత్వం ఉందన్నారు.
రాష్ట్రంలో మావోయిస్టుల దాడుల ఘటనలు తగ్గుతున్నాయని, కానీ అక్కడక్కడా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కుల, సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయన్నారు. మతవాదానికి సంబంధించి కూడా కొన్ని ఘటనలు జరుగుతున్నాయని, ఇటువంటి వాటి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, దేశీయంగా ఉన్న వ్యవస్థలతో కలిసి దీనిని నిరోధించే యత్నం చేస్తున్నామన్నారు. పరిశ్రమల వంటివి ఏర్పాటు సమయంలో కొన్ని సమస్యల కారణంగా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు, వంశధార, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఎస్‌ఈజెడ్, కొవ్వాడలో అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వంటివి ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఎన్నికల తరువాత కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని, దీనిని త్వరలోనే నియంత్రిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల తరువాత గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో రాజకీయ గొడవలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 12,198 మంది సిబ్బంది అవసరమని, వారాంతాపు సెలవు వల్ల ఈ సంఖ్య మరో 30 శాతం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు మరిన్ని వౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు.
చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న డీజీపీ గౌతం సవాంగ్