ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్య కేంద్రమా? రాజకీయ పునరావాస కేంద్రమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జూన్ 26: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం పట్ల రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అకస్మికంగా ఈ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. పరిశీలనలో భాగంగా స్థానిక సూపరింటెండెంట్ ఎటువంటి అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టారని, దీనికి సంబంధించి జిల్లా సమన్వయ కేంద్రం తనకు తెలియజేసిందన్నారు. అంతేకాకుండా స్థానిక సూపరింటెండెంట్ ఎన్.పద్మావతి, ఆర్‌బిఎస్‌కె జిల్లా కో-ఆర్డినేటర్ మెండ ప్రవీణ్ ఆరోగ్య కేంద్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులను ఇక్కడ నియమించారని, వీరిలో ప్రతాప్‌చంద్ర బరోడా, విశే్వశ్వరరావు ఆసుపత్రిలో ‘పెద్దరికం’ చేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. ఇటువంటి వారిని వెంటనే తొలగించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హాజరు పట్టిక, బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించగా లోపాలు కన్పించాయని, దీంతో రోజువారి బయోమెట్రిక్ నివేదికలను అందించాలని సిబ్బంది అడగడంతో వారు నీళ్లు నమిలారు. ఇంత ఘోరంగా సిబ్బంది పనితీరు ఉండడంతో మంత్రి తీవ్ర అసహనం అసహనం వ్యక్తం చేశారు. అనంతరం వార్డులను తనిఖీ చేయగా ఫ్యాన్‌లు పని చేయకపోడాన్ని గమనించి సిబ్బందిని నిలదీశారు. ఇప్పటికైనా మీ పని తీరు పార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అంతేకాకుండా రూ. 8.69 కోట్లు వెచ్చించి నూతన భవనాలను నిర్మించి ఆనాటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, అప్పటి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అట్టహాసంగా ప్రారంభించినా ఏడు నెలలుగా ప్రారంభించిన భవనాల్లోకి ఆస్పత్రిని తరలించకపోగా రేకుల షెడ్లలోనే వైద్యం అందించడంపై అసహనం వ్యక్తం చేశారు. నూతన భవనాలను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన తాళాలను తీయాలని కోరగా ఆస్పత్రి సిబ్బంది తెల్లమొహాలు వేశారు.
త్వరలో ముఖ్యమంత్రి పర్యటన
త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జిల్లా పర్యటన ఉంటుందని, కొమనాపల్లి వంతెన ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని, పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ ఆరోగ్య కేంద్రాన్ని కూడా పరిశీలిస్తారన్నారు.
చిత్రం...నరసన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారులను నిలదీస్తున్న మంత్రి కృష్ణదాస్