ఆంధ్రప్రదేశ్‌

కాలువలకు నీరు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 11: కృష్ణా పుష్కరాల స్నానాల కోసం జలవనరుల శాఖ అధికారులు 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించే తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు చుక్క నీరు వెల్లకుండా పూర్తిగా కట్టివేశారు. ఇక ప్రకాశం బ్యారేజీ దిగువ స్నాన ఘట్టాల నుంచి 10 అడుగుల వెడల్పులో వారధి వరకు మరో వైపు ఇసుక బస్తాలను అడ్డు వేసి తాత్కాలికంగా పుష్కర కాలువను ఏర్పాటు చేయటం జరిగింది. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారు జాము నుంచి పుష్కర స్నానాలు ఆరంభం కానుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి రెండు గేట్లను కొద్దిమేర పైకి ఎత్తి ప్రస్తుతం 50 నుంచి 100 క్యూసెక్కుల వరకు నీటిని వదలటం ప్రారంభించారు. అయితే యాత్రికులు పూర్తిగా మునగటానికి అవకాశం లేకపోయినా చెంబులతో స్నానం చేసేందుకు అనువుగా నాలుగు అడుగుల మేర నీరు నిలిచేలా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 10.1 అడుగులకు చేరింది.