ఆంధ్రప్రదేశ్‌

కృష్ణాలో బొల్లినేని ఆస్తులపై సీబీఐ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 9: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితునిగా ప్రచారంలోకెక్కిన హైదరాబాద్‌లో జీఎస్‌టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీ ఆస్తులపై సీబీఐ దాడులు ప్రారంభం కావడంతో కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో బాబుకు సన్నిహితులుగా ముద్రపడిన ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైదరాబాద్‌లో బొల్లినేని పనిచేస్తున్న కార్యాలయం, నివాసంలో తనిఖీలు చేయటంతో పాటు కృష్ణా జిల్లా పెనమలూరు, కంకిపాడు పరిసరాల్లో కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేశాడనే అభియోగంపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పెనమలూరులో 43 సెంట్లు, కంకిపాడులో 2.96 సెంట్లు, గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో 42 సెంట్ల స్థలం ఆయన ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేసే సమయంలో జగన్ ఆస్తులను ఎటాచ్ చేయించడంలో బొల్లినేని తన స్నేహితుడైన మరో డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్‌తో కలిసి కీలక పాత్ర వహించాడమే కాకుండా అప్పట్లో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసి జగన్‌ను అప్రతిష్ట పాల్జేయటంలో ముఖ్యపాత్ర వహించాడని చెబుతున్నారు. ఇదే విషయమై జగన్ జైలు నుంచి వెలుపలకి వచ్చిన తర్వాత గుర్తించి నేరుగా ప్రధాని మోదీని కలిసి ఫిర్యాదు చేశారని, తొలుత పట్టించుకోకపోయినా మరోమారు కలిసి కోరిన మీదట చెన్నైలోని ప్రాంతీయ కార్యాలయ అధికారులతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయించినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ సతీమణి భారతి పేరును కూడా చేర్పించి సమన్లు జారీ చేయించడంలో కూడా బొల్లినేని కీలకపాత్ర పోషించాడనే అభియోగాలున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖుల ఆదేశాలతోనే ఈ దాడులు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి సంబంధించిన కేసును విచారణ జరిపిన గాంధీ చంద్రబాబు సూచనల మేరకు ఆయన కేసుకు సంబంధించిన పలు ఫైళ్లలో మార్పులు చేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాంధీ గతంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం నుచి బదిలీ అయినా అనధికారికంగా నెల రోజులు విధుల్లో కొనసాగారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో 1992లో విధుల్లో చేసిన గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి రావడంతో హైదరాబాద్ కమిషనరేట్‌లో చేరారు. 2003లో డీఆర్‌ఐలో చేరారు. 2004 నుంచి 2007 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన జీఎస్‌టీ సీనియర్ అధికారిగా కొనసాగుతున్నారు.