ఆంధ్రప్రదేశ్‌

రేపటి నుంచి ఆరెస్సెస్ జాతీయ స్థాయి సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 9: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) జాతీయ స్థాయి ప్రాంత ప్రచారక్ సమావేశాలు ఈ నెల 11 నుండి మూడు రోజుల పాటు నగరంలో జరగబోతున్నాయి. ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ సంఘ్‌చాలక్ భూపతిరాజు శ్రీనివాసరాజు ఈ సమావేశాల వివరాలను మంగళవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఆరెస్సెస్, అనుబంధ సంస్థలు గత ఏడాది కాలంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలపై విస్తృత సమీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాల్లో జాతీయ స్థాయి ప్రచారక్‌లతో పాటు ప్రాంత, క్షేత్రస్థాయి ప్రచారక్‌లు పాల్గొంటారని, ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ మార్గదర్శకం చేస్తారని వివరించారు.