ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వానికి రూ. 300 కోట్లు ఎగవేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 9: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో విల్లాస్ నిర్మించి వేల కోట్ల రూపాయలు ఆర్జించిన లింగమనేని సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు 300 కోట్ల రూపాయలను ఎగవేసిందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరికి అండగా ఉన్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాజ గ్రామంలో 40 ఎకరాల్లో నిర్మించిన విల్లాస్‌లో ఒక్కోదాన్ని 4 నుంచి 6 కోట్ల రూపాయలకు విక్రయించారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం కాజ గ్రామ పంచాయతీకి స్వాధీనపరచాల్సిన 4ఎకరాల భూమిని ఇవ్వకపోగా ప్రశ్నించిన పంచాయతీ కార్యదర్శిపై కేసులు పెట్టడమే కాకుండా కేసు బెంచీ మీదికి రాకుండా వ్యవస్థలను లింగమనేని సంస్థ యాజమాన్యం మేనేజ్ చేసిందని ఆరోపించారు. పొన్నూరు నియోజకవర్గంలోని నంబూరు, తాడికొండ నియోజకవర్గంలోని కంతేరు గ్రామాల్లోనూ వందలాది ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టిన ఈ సంస్థ ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించాల్సిన భూములను స్వాధీనపరచకుండా నిబంధలను తుంగలో తొక్కి ప్రభుత్వాదాయానికి గండి కొట్టిందని ధ్వజమెత్తారు. లింగమనేని సంస్థే కాకుండా నంబూరు, కాజ గ్రామాల్లో నిర్మాణాలు జరుపున్న ప్రముఖ బడా రియల్ ఎస్టేట్, మరికొన్ని సంస్థలు దళితులను భయపెట్టి భూములు లాక్కుని నిర్మాణాలు చేపట్టాయన్నారు. ప్రభుత్వ పోరంబోకు భూములు, డొంకలను కూడా ధ్వంసం చేసి నిర్మాణాలు జరుపుతున్నాయన్నారు. దేవదాయ శాఖ భూములు ఆక్రమించి చేసిన నిర్మాణాలపై విజిలెన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని కోరతామని చెప్పారు. ఆయా రియల్ ఎస్టేట్ సంస్థల వద్ద విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు కొనేవారు అన్ని అనుమతులు ఉన్నాయో, లేదో పరిశీలించాలని, లేదంటే నష్టపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే ఆర్కే సూచించారు.
చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్కే