రాష్ట్రీయం

రాష్టప్రతి ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 2వ తేదీ మధ్య తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వెళ్లి స్ధిరపడిన కుటుంబాల పిల్లలను స్ధానికులుగా ప్రకటించి విద్యా సంస్ధల్లో రిజర్వేషన్ల సదుపాయాలను వర్తింప చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. శ్రీకాకుళంకు చెందిన బొడ్డేపల్లి జ్యోత్స్న అనే యువతి తనను స్థానికేతరురాలిగా ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ ప్రకటించి ఎమ్సెట్-2016 అడ్మిషన్లను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ అనిస్‌తో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. తాను కళింగ సామాజిక వర్గానికి చెందినదానినని, ఆంధ్రాలో ఈ సామాజిక వర్గాన్ని బిసిగా గుర్తించిందన్నారు. కాని తన సామాజికవర్గాన్ని ఇతర బిసి కేటగిరీగా గుర్తించడాన్ని ఆమె సవాలు చేశారు. తాను నివాస ధ్రువపత్రం, కుల ధ్రువపత్రం సమర్పించానని, వీటిని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ యంత్రాంగం జారీచేసిందని, కాని తనను స్థానికేతరురాలిగా వర్శిటీ గుర్తించిందని పేర్కొన్నారు.

పురోగతి నివేదిక సమర్పించండి
అగ్రిగోల్డ్ కేసులో ఏపి సిఐడికి హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 13: అగ్రిగోల్డ్ స్కాంపై స్టేటస్ నివేదికను సమర్పించాలని హైకోర్టు ఏపి సిఐడి అధికారులను ఆదేశించింది. ఈ కేసును హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. అగ్రిగోల్డ్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ డిపాజిట్ చేసిన వారికి సొమ్ము చెల్లించేందుకు తమ సంస్థ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆస్తులను వేలం వేసి డిపాజిట్‌దార్లకు వెంటనే సొమ్ము చెల్లించే విషయమై ప్రత్యామ్నాయ ప్రణాళికను అందించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.