ఆంధ్రప్రదేశ్‌

మాకొద్దీ ఆవాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 9: పోలవరం నిర్వాసితులకు నిర్మిస్తున్న ఇళ్లల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని, నాసిరకం మెటీరియల్‌తో నిర్మిస్తున్నారని నిర్వాసితులు ఆందోళనకు దిగారు. చాలీచాలని వసతిగా వున్న ఈ అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు తమకు వద్దని నిర్వాసితులు విముఖత చూపుతున్నారు. సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో దేవీపట్నం సమీపంలో పోలవరం నిర్వాసితులకు పెద్ద ఎత్తున పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం, ఆర్ అండ్ బీ, గృహనిర్మాణ సంస్థ, సాంఘిక సంక్షేమ శాఖల ఇంజినీరింగ్ విభాగాలు ఐటీడీఏ పర్యవేక్షణలో పునరావాస కాలనీల నిర్మాణం కాంట్రాక్టు సంస్థల ద్వారా చేపట్టాయి. రూ.100 కోట్ల భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపణలు వినవస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 8 మండలాల్లో 300 గ్రామాలకు చెందిన 3 లక్షల మంది గిరిజనులు నిర్వాసితులవుతున్నారు. 60 వేల కుటుంబాలు, 3.50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి, 50 వేల ఎకరాల అటవీ భూమికి నష్టం వాటిల్లుతోంది. జీవో ప్రకారం గిరిజన నిర్వాసితులకు రూ.3.55 లక్షలు కేటాయించాల్సివుండగా రూ.2.84 లక్షలతో కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. గిరిజనేతర ఇళ్లకు రూ.2.55 లక్షలు కాగా అవి కూడా రూ.2.84 లక్షలతోనే నిర్మించడానికి ఒప్పందంచేశారు. తుని మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు కూడా పోలవరం కాల్వ ముంపులో నిర్వాసిత ప్రాంతంగా మారింది. అర్బన్ ప్రాంతం కాబట్టి నిబంధనల ప్రకారం రూ.7.25 లక్షలు కేటాయించాల్సివుంది. అయితే ఇక్కడ కూడా రూ.2.84 లక్షలకే ఇళ్లు నిర్మించడానికి ఒప్పందం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలోని నిర్వాసితుల సంఘం హైకోర్టులో కేసు వేసింది. దేవీపట్నం మండలంలో 42 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ మండలంలోని ఏనుగులగూడెం, మంటూరు, అగ్రహారం గ్రామాలకు చెందిన 306 కుటుంబాలకు రూ.26 కోట్ల 91 లక్షల 44 వేల వ్యయంతో ఇందుకూరు-1 కాలనీని నిర్మిస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ పర్యవేక్షణలో హెచ్‌ఐపీఎల్-జీకే అసోసియేట్స్ సంస్థ ఈ కాలనీని నిర్మిస్తోంది. ఈ గ్రామానికి రూ.10.71 కోట్ల వ్యయంతో 306 ఇళ్లు నిర్మిస్తున్నారు. రోడ్లు, తాగునీరు, ఇతర భవనాలు, వసతులకు రూ.16 కోట్ల 20 లక్షల 44 వేలు ఖర్చు చేయనున్నారు. రెండు గదులతో పాటు చిన్న వరండా, చిన్న కిచెన్ ఏర్పాటుచేసి ప్రస్తుతం 380 చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) ఇళ్లను నిర్మిస్తున్నారు. గోకవరం శివారు రాజుపాలెం వద్ద నిర్వాసిత కాలనీలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ ఇళ్లను ఆరు పిల్లర్లతో కడుతున్నారని, 9 పిల్లర్లతో నిర్మించాలని, ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్వాసితులు ఇటీవల ధర్నా నిర్వహించారు. 2013 చట్టం ప్రకారం జీవో నెంబర్ 641ని వర్తింపజేయాలని కోరుతూ ముంపు గ్రామమైన తొయ్యేరు నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.2.84 లక్షలతో నిర్మిస్తున్నారని, అయితే కడుతున్న ఇళ్లకు కనీసం రూ.1.50 లక్షలు కూడా ఖర్చవ్వదని ఆరోపిస్తున్నారు. ఇళ్ళు అగ్గిపెట్టెల్లా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతంలో మొత్తం 1095 ఇళ్ళు నిర్మిస్తున్నారు. ఇందుకూరు గ్రామంలో 306 మందికి, ఇందుకూరుపేటలో 317 మందికి పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. తమకు ఉపాధి లభించని ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తే ఎలా బతుకుతామని నిర్వాసితులు అంటున్నారు. తమకు ఇష్టంలేని చోట, అనుకూలంగా లేనిచోట అధికారులు తమ పేర్లతో గ్రామ సభలో ఫోర్జరీ సంతకాలు చేసి ఇళ్లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏనుగులగూడెం గ్రామంలో 106 కుటుంబాలకు చెందిన 432 మంది గిరిజనులకు 30 కిలోమీటర్ల దూరంలో ఇందుకూరు వద్ద పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. ఇక్కడ కూలి పనులు దొరకవని, డి రావిలంక వద్ద నిర్మిస్తే పురుషోత్తపట్నం, సీతానగరం, నాగంపల్లి గ్రామాల్లో కూలి పనులు చేసుకుంటామని ఏనుగులగూడెం నిర్వాసితులు కోరుతున్నారు.
గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా గృహనిర్మాణ సంస్థలతో కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఈ నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేయాలని ఆదివాసీ మహాసభ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. 2016 సెప్టెంబర్ 14న రెవెన్యూ భూసేకరణ డిపార్టుమెంట్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం నిర్వాసితులైన ఒక్కొక్క గిరిజన కుటుంబానికి గృహనిర్మాణం కోసం రూ.4.55 లక్షలు కేటాయించాల్సి వుంది. ప్రభుత్వం రూ.2.84 లక్షలు మాత్రమే కేటాయిస్తూ గృహనిర్మాణ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలు నిబంధనలకు విరుద్ధం. వెంటనే గృహనిర్మాణాల ఒప్పందాలు రద్దుచేసి, నిర్మాణాలను నిలుపుదల చేసి సమగ్ర విచారణ జరిపించాలని ఆదివాసీ మహాసభ ఫిర్యాదు చేసింది. ఈ ఒప్పందాలు నిబంధనలకు విరుద్ధం కాబట్టి వెంటనే ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మిస్తున్న కాలనీల ఇళ్లను రద్దుచేయాలని కోరుతోంది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, జలవనరుల శాఖ మంత్రి పి అనిల్‌కుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబులకు ఆదివాసీ మహాసభ ఫిర్యాదుచేసింది. ఈ ఒప్పందాలను రద్దుచేసి విచారణ పూర్తయ్యేంత వరకు నిర్మాణాలు నిలుపుదల చేయాలని, నిర్వాసితుల గృహ నిర్మాణాల పేరుతో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేసిన తీరుపై కూడా విచారణ జరిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.