ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఏడాది ఎవరెస్ట్‌ను అధిరోహిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 9: యూరప్‌లో అతి ఎత్తయిన ఎల్‌బ్రూస్ మంచు పర్వతాన్ని రిటైర్డ్ పోలీసు అధికారి కాకమాను రాజశిఖామణి అధిరోహించారు. 60 ఏళ్ల ప్రాయంలో ఆయన మంచుపర్వతాన్ని అధిరోహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ మంచు పర్వతం అధిరోహించడంలో గొప్ప అనుభూతిని పొందానన్నారు. పర్వతాన్ని ఎక్కేటపుడు ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వచ్చిందన్నారు. ఈ పర్వతారోహణను అతి భయంకరమైన అనుభవంగా పేర్కొన్నారు. ఎల్‌బ్రూస్ పర్వతాన్ని అధిరోహించినపుడు తాను తిరిగి వస్తానని అనుకోలేదన్నారు. ఇదో పునర్జన్మ వంటిదన్నారు. ఎల్‌బ్రూస్ పర్వతారోహణ విజయవంతం కావడంతో వచ్చే ఏడాది ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.
గత నెల 29 నుంచి ఈ నెల 8 వరకు మంచుపర్వతం అధిరోహించారు. ఈ మంచు పర్వతారోహణకు రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికైన విషయం విదితమే. రష్యాలోని కాకస్ పర్వతాల్లో ఉన్న ఎల్‌బ్రూస్ పర్వతం ఎత్తు 5642 మీటర్లు (18510 అడుగులు). ఈ మంచు పర్వతం దాదాపు మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఈ పర్వతారోహణకు సాహసం చేసిన తొలి రిటైర్డ్ పోలీసు అధికారి రాజశిఖామణి కావడం హర్షణీయం. హైదరాబాద్‌లోని ట్రానె్సండ్ అడ్వంచర్ సంస్థ ఈ పర్వతారోహణ కార్యక్రమాన్ని నిర్వహించింది.

చిత్రం...ఎల్‌బ్రూస్ పర్వతాన్ని అధిరోహించిన రాజశిఖామణి