ఆంధ్రప్రదేశ్‌

గ్రామాల దత్తతతో అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 13: అన్నివిధాలా ప్రగతి సాధించేందుకు వీలుగా విశాఖ జిల్లాలోని పలు మండలాల పరిధిలో వంద గ్రామాలను తాను దత్తత తీసుకుంటున్నట్టు రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భాగస్వామ్యంతో టిఎస్సార్ ట్రస్టు ఆధ్వర్యంలో దత్తత గ్రామాల అభివృద్ధి చేపడతామన్నారు. ఆనందపురం, పద్మనాభం, భీమిలి, వేపాడ, ఎస్.కోట, జామి మండలాలకు చెందిన గ్రామాల్లో వౌలిక వసతులు, ఆర్‌ఓ ప్లాంట్‌లు, పాఠశాలల్లో ఫర్నిచర్, పరికరాల ఏర్పాటు వంటివి ఈ అభివృద్ధిలో ఉంటాయన్నారు. నాల్కో, ఓఎన్‌జిసి, గెయిల్ వంటి సంస్థలను ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నట్టు చెప్పారు. ఒక్కో గ్రామానికి కనీసం ఐదు లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. సామాజిక సేవే కాకుండా గ్రామాల అభివృద్ధిపైనా తాను దృష్టిపెడుతున్నట్టు తెలిపారు. 40 ఏళ్ళ సంఘర్షణకు శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశ్యంతో అన్ని రాజకీయపార్టీల అంగీకారంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు సిద్ధపడిందన్నారు. అయితే అధికారంలో ఉన్నందున అంతా తమ పార్టీని అపార్ధం చేసుకున్నారన్నారు. పదేళ్ళపాటు హోదా కల్పించాలని ఆరోజు డిమాండ్ చేసిన బిజెపి అధికారంలోకి వచ్చిన రెండేళ్ళు పూర్తయినా కనీసం దీని గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు బిల్లు పెట్టారని, ఇది గెలిస్తే ఎక్కడ సమస్య పరిష్కారమవుతుందోనన్న ఉద్దేశ్యంతో రానివ్వకుండా చేశారరన్నారు. దీనినిబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకమనేది స్పష్టమవుతోందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు టిఎస్సార్