ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ దర్శనానికి రూ. 300 మాత్రమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 13: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గగుడిలో ప్రత్యేక దర్శనం టికెట్ ధరను 500 రూపాయలుగా నిర్ణయించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. విలేఖరుల సమావేశం జరుగుతున్నప్పుడు కొందరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, తిరుమల తిరుపతి దేవస్థానమే ప్రత్యేక దర్శనం టికెట్ ధరను 300 రూపాయలుగా నిర్ణయిస్తే, దుర్గ గుడిలో ఇంత రేటు ఏమిటంటూ ఆయన అక్కడే ఉన్న దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధను ప్రశ్నించారు. అయితే అమరావతిలో రూ.300 ఉన్నందున దుర్గ గుడిలో రేటును పెంచామని చెప్పారు. ఈ సమాధానానికి సిఎం విస్తుపోయారు. ఒక్క దుర్గగుడే కాదు...రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ రూ.300ల ధరను అమలు చేయాలంటూ ఆదేశించారు. ఇదిలాఉండగా రెండోరోజైన శనివారం దుర్గగుడిలో రూ.500ల టిక్కెట్లు 400 అమ్ముడుపోగా 2 లక్షల 10వేల రూపాయల ఆదాయం లభించింది.

సిఎం ముందు చూపు పుష్కలంగా నీరు
జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 13: ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపువలనే పుష్కర స్నానాలకు పుష్కలంగా నీరు అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పుష్కరాలకు కొద్ది రోజుల ముందు వరకు కేవలం మూడడుగుల లోపు మాత్రమే నీరు ఉండేదని ఉమ చెప్పారు. దీనిపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం సాగించారని, నీళ్లు లేకుండానే ఘాట్ల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారన్నారు. మీడియా సెంటర్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకాశం బారేజీ నీటిమట్టం సామర్థ్యం 12 అడుగులు కాగా శనివారం ఉదయానికి 11.5 అడుగులకు చేరిందన్నారు. 12 లక్షల ఎకరాల ఆయకట్టు కల్గిన కృష్ణా డెల్టాలో శనివారం ఉదయం నుంచి తూర్పు డెల్టా కు 5600 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 3422 క్యూసెక్కులు నీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. పుష్కర స్నానాల కోసం బారేజీ దిగువన రెండు కిలోమీటర్ల పొడవున తవ్విన లీడింగ్ ఛానల్‌కు కనీసం నాలుగు అడుగులు లోతు ఉండేలా ఎప్పటికపుడు తాజా నీటిని వదలుతున్నామని చెప్పారు. అయితే కొందరు పనిగట్టుకుని కృష్ణా నదిలో కలుస్తున్న గోదావరి నీటి వల్ల బాక్టీరియా చేరిందని తపుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. సారవంతమైన గోదావరి జలాల వల్ల చీడపీడలు పోయి ఎరువులు, పురుగు మందుల వినియోగం సగం తగ్గిపోయిందంటూ రైతులు ఎంతగానో సంతోషిస్తున్నారని అన్నారు. అన్నింటిని మించి ఇప్పటికి సాగు కోసం 8.6 టియంసిల నీరు వినియోగం జరిగితే అందులో గోదావరి నీరు 6.2 టియంసిల నీరు ఉందన్నారు. గండివల్ల కొద్ది రోజులపాటు నీటి సరఫరా నిలిచినా ప్రస్తుతం రెండు మోటార్లు పనిచేస్తున్నాయని అన్నారు. క్రమేణ మరో 12 పంపులు పనిచేయగలవన్నారు. ముందస్తు ఆలోచనతో పులిచింతల వద్ద మూడు టియంసిల నీరు నిలువ ఉంచామని, ప్రస్తుతం 11 వేల క్యూసెక్కుల నీరు చేరుతుంటే 9375 క్యూసెక్కులు అవుట్ ఫ్లో గా ఉందన్నారు. గోదావరి నీటి రాకతో మిగిలే నీటిని రాయలసీమకు మళ్ళిస్తామన్నారు. గోదావరి ఎడమ కాలువవద్ద చింతలపూడి నుంచి లిఫ్టు ద్వారా ఏలేరు నుంచి విశాఖకు వచ్చే ఏడాదికల్లా పుష్కలంగా నీరు అందిస్తామన్నారు.

సాగర్‌కు పెరుగుతున్న నీరు
విజయపూరి సౌత్, ఆగస్టు 13: నాగార్జున సాగర్ జలాశయానికి కుడి కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటి సరఫరాను శనివారం సాయంత్రం ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు పరిధిలో మంచినీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చటంతో జిల్లా ప్రజాప్రతినిధులు కృష్ణా రివర్ బోర్డుకు పది టిఎంసిల నీటిని విడుదల చేయాలని కోరింది. ఆంధ్ర, తెలంగాణ అధికారుల సమావేశంలో సాగర్ కుడి కాలువకు ఏడు టిఎంసిల నీరు ఇచ్చే విధంగా కృష్ణా రివర్ బోర్డు ఆదేశించింది. ఏడు టిఎంసిల నీరు సరఫరా చేయటంతో శుక్రవారం సాయంత్రం ఆపేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటి మట్టం 511.70 అడుగులకు చేరుకుంది. ఇది 134.5749 టిఎంసిలకు సమానం. విద్యుత్ ఉత్పాదన నిమిత్తం 15507 క్యూసెక్టుల నీటిని విడుదల చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో
కిటకిటలాడిన స్నాన ఘట్టాలు

ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఆగస్టు 13: కృష్ణా పుష్కరాలు రెండవరోజు శనివారం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్నానఘాట్లలో 81 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరుస సెలవులు ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించారు. అయితే జనం మామూలుగానే వచ్చారు. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లలో సుమారు 55 వేల మంది భక్తులు, సంగమేశ్వరం వద్ద 26 వేల మంచి పుష్కర స్నానాలు చేశారు. శనివారం సెలవు కావడంతో శ్రీశైలానికి లక్ష మంది వస్తారని అధికారులు అంచనా వేసినప్పటికీ అనుకున్న స్పందన కాన రాలేదు. అంతేగాకుండా శ్రీశైలం నుంచి పాతాళగంగ వరకు రోప్‌వేలో కేవలం ప్రముఖులను మాత్రమే అనుమతించాలని తొలుత నిర్ణయించిన అధికారులు సాధారణ భక్తులను సైతం అనుమతించారు. ప్రముఖులు ఎవరూ శ్రీశైలం వస్తున్న సమాచారం లేకపోవడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. సంగమేశ్వరం వద్ద కూడా నిబంధనలు సడలించారు. పార్కింగ్ సమస్య కారణంగా ప్రైవేటు వాహనాలను గతంలో నిర్ణయించిన ప్రదేశంలో నిలిపి వేయాలని అక్కడి నుంచి మినీబస్సుల్లో నేరుగా స్నానఘాట్ల వరకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో ఘాట్ల వరకు బస్సులు, ఇతర వాహనాలను అనుమతిస్తున్నారు.
తెలంగాణ ఘాట్లకు సీమ భక్తులు
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల భక్తులు పుష్కర స్నానానికి తెలంగాణకు వెళ్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్, బీచుపల్లిలోని ఘాట్లలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. వీటిలో బీచుపల్లి ఆలయం జాతీయ రహదారి పక్కనే ఉండగా, ఆలంపూర్ ఆలయం జాతీయ రహదారికి 12 కిలో మీటర్ల దూరంలో ఉంది. బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం పక్కనే ప్రవహిస్తున్న కృష్ణానది వద్ద శాశ్వత స్నానఘాట్ ఉండగా ఆలంపూర్‌కు అయిదు కిలోమీటర్ల దూరంలోని గొందిమర్ల వద్ద పుష్కర ఘాట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా కర్నూలు నుంచి గొందిమర్ల, బీచుపల్లికి ప్రత్యేకంగా 100 బస్సులు నడుపుతున్నారు. తెలంగాణకు వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపడంతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరం వద్ద రద్దీ తగ్గిందని చెప్పవచ్చు.