ఆంధ్రప్రదేశ్‌

విద్యాశాఖలో బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 11: పాఠశాల విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు, అడిషనల్ డైరెక్టర్లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి విద్యాశాఖ ప్రధానకార్యదర్శి బి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ డైరెక్టర్(వీఈ)గా ఉన్న కే రవీంద్రనాథ్‌రెడ్డిని గుంటూరు ఆర్‌జేడీగా బదిలీ చేసి, గుంటూరు ఆర్‌జేడీగా ఉన్న కేవీ శ్రీనివాసులును ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కడప ఆర్‌జేడీగా ఉన్న బీ ప్రతాప్‌రెడ్డిని జాయింట్ డైరెక్టర్ (ఈఈ)గా, జాయింట్ డైరెక్టర్ (ఈఈ)గా ఉన్న ఏంవి కృష్ణారెడ్డిని ఆర్‌జేడీ కడపగా బదిలీ చేశారు. జాయింట్ డైరెక్టర్ మోడల్ స్కూల్స్‌గా ఉన్న ఆర్ నరసింహరావును కాకినాడ ఆర్‌జెడీగా, కాకినాడ ఆర్‌జేడీగా ఉన్న డీ దేవానందరెడ్డిని జాయింట్ డైరెక్టర్ (వీఈ)గా బదిలీ చేశారు. ఐఎఎస్‌ఈ రాజమండ్రి ప్రిన్సిపాల్‌గా ఎంఆర్ ప్రసన్నకుమార్‌ను జాయింట్ డైరెక్టర్ మోడల్ స్కూల్స్‌గా బదిలీ చేశారు. పాడేరు విద్యాశాఖాధికారిగా ఉన్న ఎం జ్యోతికుమారిని భీమిలీ డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, నెల్లూరు విద్యాశాఖాధికారిగా ఉన్న కే శ్యామూల్‌ను అనంతపురం విద్యాశాఖాధికారిగా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న ఎం జనార్ధనాచార్యులుకు నెల్లూరు విద్యాశాఖాధికారిగా పోస్టింగ్ ఇచ్చారు. డెప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఎం రామలింగంను ఏపీ జనహర్ బాలభవన్ డైరెక్టర్‌గా, ఎస్‌ఎస్‌ఎ డెప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న కుసుమ చంద్రకళను శ్రీకాకుళం విద్యాశాఖాధికారిగా బదిలీ చేశారు. ఏపీ జవహర్ బాలభవన్ డైరెక్టర్‌గా ఉన్న విఎన్ మస్తానయ్యను పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్‌గా, ఆ స్థానంలో ఉన్న పి పార్వతిని అడిషనల్ డైరెక్టర్ (ఎండీఎం)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.