ఆంధ్రప్రదేశ్‌

పరిశ్రమలు ప్రారంభించకపోతే భూములు స్వాధీనం చేసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: గత ప్రభుత్వంలో పరిశ్రమల స్థాపనకు కేటాయించిన భూముల్లో పరిశ్రమలను ప్రారంభించకపోతే ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుపయోగంగా ఉన్న భూముల గురించి పీడీఎఫ్ సభ్యుడు రాము సూర్యారావు ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ, ఇలా స్వాధీనం చేసుకున్న భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పరిశ్రమలు, గృహ నిర్మాణానికి అనువైన భూమి 4.08 లక్షల ఎకరాలు అందుబాటులో ఉందన్నారు. పేదలకు పంపిణీకి అనువైన భూమి 3.15 లక్షల ఎకరాలు ఉందన్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వాలని లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుకుందన్నారు. వైఎస్సార్ చేయూత పథకాన్ని వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని జి.తిప్పేస్వామి అడిగిన ప్రశ్నకు మంత్రి విశ్వరూప్ బదులిచ్చారు. విధి విధానాలు ఖరారు చేస్తున్నామని, నాలుగు సంవత్సరాల్లో 75 వేల రూపాయలను ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు అందచేస్తామన్నారు.