ఆంధ్రప్రదేశ్‌

నాలుగైదు రోజులు వర్షాలుండవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 11: వచ్చే నాలుగైదు రోజుల వరకు వర్షాలు పడే అవకాశం లేదని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం గురువారం రాత్రి పేర్కొంది. అయితే అల్పపీడనద్రోణి ఏర్పడిన ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో తేలిక వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఈ కేంద్రం తెలియజేసింది. శుక్రవారం, శనివారాల్లో కోస్తాంధ్రాలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయని కేంద్రం వివరించింది. తప్పితే భారీ వర్షాలు కురిసే అనుకూల పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదని, దీనికి సమయం పట్టవచ్చని కేంద్రం తెలిపింది. ఏపీలో గుంటూరు, కృష్ణా, చిత్తూరు తదితర జిల్లాల్లో తేలిక వర్షాలు పదడుతున్నందున ఒకటి లేదా రెండు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు అవుతుందని కేంద్రం పేర్కొంది. నిన్న, మొన్నటి మత్స్యకారులకు హెచ్చరికలు ఉండేవని, అవి కూడా ఇపుడు లేవని కేంద్రం తెలిపింది.