ఆంధ్రప్రదేశ్‌

కాళేశ్వరం కడుతుంటే మీరు గాడిదలు కాశారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి మధ్య మాటల తూటాల పేలాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ల మధ్య ఇటీవల కాలంలో అనూహ్య రీతిలో పెరుగుతున్న సఖ్యత, ముఖ్యంగా వివాదాస్పద కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ వెళ్లడంపై దాదాపు గంట సేపు చర్చ జరిగింది. చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభమై పూర్తయితే ఈ మధ్య కాలంలో ఆయన గాడిదలు కాశారా అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంపై కేసీఆర్‌తో అంతటి సఖ్యత ఎందుకు... మేధావులు, ప్రజాప్రతినిధులతో ఎలాంటి చర్చ లేకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఎలా అని చంద్రబాబు పదేపదే ప్రశ్నిస్తుంటే అధికారపక్ష సభ్యులు ఓటుకు నోటు కేసంటూ అడుగడుగునా అడ్డు తగిలారు. తమకు మాట్లాడే అవకాశం లేకుండా పోతున్నదంటూ ఓ దశలో బాబుతో సహా టీడీపీ సభ్యులు లేచి నిలబడి నినాదాలిస్తూ పోడియం వైపునకు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంతో సమయస్ఫూర్తిగా వారిని సముదాయిస్తూ ఇది ప్రశ్నోత్తరాలంటూనే బాబుకి, అచ్చెన్నాయుడికి మాట్లాడే అవకాశం కల్పించారు.
తొలుత చంద్రబాబు మాట్లాడుతూ నేడు అంతా బాగుంటుంది.. రేపు తాను సీఎం సీట్లో, జగన్ ప్రతిపక్షనేత సీట్లో కూర్చోవచ్చు.. అయితే ఇవేమీ గుర్తించకుండా జగన్ అన్నీ తనకు తెలుసు అనుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. జగన్ వయస్సు తన రాజకీయ అనుభవమంత లేదంటూ భవిష్యత్‌లో వారి మధ్య సఖ్యత దెబ్బతింటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏపీ, తెలంగాణ .. భారత్ - పాక్ మాదిరిగా మారతాయని నానా యాగీ చేసి, నేడు ఆ రాష్ట్ర సీఎంను వెనకేసుకు వస్తారా అని ప్రశ్నించారు. ఈ సభలో మాట్లాడే ప్రతి అంశాన్ని ప్రజలు చూస్తున్నారు.. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందని గుర్తు చేస్తూ ఎంతో సున్నితమైన ఈ అంశంపై ఏకపక్ష నిర్ణయాలు తగవన్నారు. దీనిపై జగన్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై పూర్తవుతుంటే బాబు ఏమి గాడిదలు కాశారని ప్రశ్నించారు.
అదేమంటే తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు.. అసలు గత ఐదేళ్లుగా ఆయన ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండటమే మన దౌర్భాగ్యం.. ఈ రాష్ట్రానికి ఖర్మ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్టుల గురించి బాబు ఎందుకు ఆలోచించలేదన్నారు. ఓ దశలో టీఆర్‌ఎస్‌తో తమను కలవకుండా కేంద్రం కుట్రలు చేసిందని చెప్పుకుని, ఇప్పుడేమో కేసీఆర్‌ను శత్రువులా చూస్తున్నారు.. బాబులా కుళ్లు రాజకీయాలు చేసే నేత ఈ ప్రపంచంలోనే మరెవరూ ఉండరన్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కల్పించుకుంటూ సీఎం గాడిదలు కాసారా అంటే టీడీపీ సభ్యుడు నిమ్మల రామనాయుడు మాత్రం తమ నేత బాబును గాడిద అన్నారు.. గాడిద అన్నారని పదేపదే చెబుతున్నారని చురకలు వేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఎవరెంత దొబ్బేసారో అన్ని తేలుస్తాం.. ముందుంది అసలు సినిమా అంటూ తాము ఏ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయలేదన్నారు.