ఆంధ్రప్రదేశ్‌

ప్రహసనంగా జీరో అవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 11: శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం ప్రహసనంగా సాగుతోంది.. ఎమ్మెల్యేలడిగిన ప్రశ్నలపై స్పందించే వారు లేకపోవటంతో అయోమయానికి గురవుతున్నారు. గురువారం సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఏ ఒక్క మంత్రి స్పందించలేదు. వైసీపీ ఎమ్మెల్యే జోగారావు గత ప్రభుత్వ హయాంలో మూసివేసిన హాస్టళ్ల గురించి, టీజేఆర్ సుధాకర్‌బాబు సుబాబుల్, ఆయిల్‌పామ్ రైతుల్ని ఆదుకోవాలని, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పౌరసరఫరాలశాఖలో 30 మంది వాలంటీర్ల ఉద్యోగ భద్రత గురించి సభలో ప్రస్తావించారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డి స్పందిస్తూ నాలుగు సార్లు మాట్లాడే అవకాశం వచ్చింది.. నియోజకవర్గ సమస్యలను వివరించా.. సమాధానాలు రావటంలేదని స్పీకర్ నుద్దేశించి అన్నారు. ఇటీవల జరిగిన శిక్షణా తరగతులలో కూడా ఈ సమావేశాల్లో తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాలని మంత్రులు, అధికారులకు సూచించారని గుర్తుచేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకుని సభ్యులడిగిన ప్రశ్నలపై మంత్రులు విధిగా స్పందించాలని అధికారులు లిఖితపూర్వకమైన సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. సంబంధిత మంత్రులు సభలో లేకపోతే ఎవరో ఒక మంత్రి వర్గ సహచరులు సభ్యులడిగిన ప్రశ్నను నోట్ చేసుకున్నాం.. త్వరలో సమాధానం పంపుతామని బదులివ్వాలని హితవు పలికారు. సభలో ప్రతి సభ్యుడు నియమావళి తప్పనిసరిగా పాటించాలన్నారు.