ఆంధ్రప్రదేశ్‌

మంత్రి కన్నబాబు సోదరుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్‌బాబు (42) బుధవారం రాత్రి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు. కుటుంబ సభ్యులు సురేష్‌బాబు మృతదేహాన్ని కాకినాడలోని మంత్రి నివాసానికి తరలించారు. సీఎం జగన్ సంతాపం: సురేష్‌బాబు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కన్నబాబుకు ఫొన్ చేసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.