ఆంధ్రప్రదేశ్‌

కదలిక లేని ఏజెన్సీ జాతీయ రహదారి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 11: తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల ఏజెన్సీ మీదుగా సుమారు 418 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చలేదు. పూర్తి అటవీ ప్రాంతాల మీదుగా సాగే ఈ జాతీయ రహదారిని సుమారు రూ.800 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం జిల్లాను అనుసంధానం చేసే ఈ రోడ్డుకు డీపీఆర్ కూడా రూపొందించారు. ఈ రోడ్డు నిర్మాణానికి పెద్దగా భూసేకరణ కూడా అవసరం లేకపోయినా ఎందుచేతనో ఇంకా కార్యరూపంలోకి రాలేదు. ఈ రోడ్డు నిర్మాణం జరిగితే ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సహజసిద్ధ అందాలతో అలరారే ఈ భూభాగం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం వుంది. మావోయిస్టు కార్యకలాపాలకు కూడా తావులేని విధంగా మారుమూల లోతట్టు ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో అనుసంధానం అయ్యేందుకు రహదారుల వ్యవస్థ బాగా విస్తృతమవుతుందనే ఆలోచనతో రూపొందించారు. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలోని మూడు జిల్లాలను కలిపే విధంగా రూపొందించిన ఈ రోడ్డును రెండే లేన్ల రోడ్డుగా నిర్మించనున్నారు. ఆంధ్రా, ఒడిస్సా బోర్డర్ (ఏవోబీ) కూడా ఈ రోడ్డుకు అనుసంధానం కావడంతో రాష్ట్రాల మధ్య ట్రాఫిక్ విస్తృతమవుతుందని డీపీఆర్‌లో రూపొందించారు.
రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఏజెన్సీలో రెండు రోడ్లను జాతీయ రహదారిగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకంగా అభివృద్ధితో పాటు ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, అటవీ ఉత్పత్తుల రవాణాకు మరింత ప్రోత్సాహకరంగా వుండి గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుందని యోచించారు. ఈ మొత్తం జాతీయ రహదారిని 418 కిలోమీటర్లుగా నిర్ణయించారు. సుమారు 418 కిలోమీటర్ల మేరకు తూర్పు, విశాఖ, విజయనగరం జిల్లాలను కలుపుతూ నిర్మించే ఈ రోడ్డు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 120 కిలోమీటర్ల మేర వుంటుంది. రాజమహేంద్రవరం, గోకవరం, రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకు, ఎస్ కోట, విజయనగరం ఏజెన్సీ ఏరియాలను కలుపుతూ దీనిని నిర్మిస్తారు. ఇదిలా వుండగా సుమారు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో కొవ్వూరు నుంచి గుండుగొలను రోడ్డును విస్తరణ చేపట్టారు. నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భూసేకరణకే రూ.393 కోట్లు కేటాయించారు. మిగిలిన నిధులు రోడ్డు విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు కేటాయించారు. గుండుగొలను, దేవరపల్లి, కొవ్వూరు వరకు సుమారు 70 కిలోమీటర్ల ఎన్‌హెచ్ 16గా ఈ రోడ్డును 2021కి పూర్తిచేయడానికి నిర్ణయించారు. ఈ రోడ్డు విస్తరణ వల్ల విజయవాడ, విశాఖ మధ్య సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ రోడ్డును అత్యవసరంగా విస్తరించడం వల్ల అనేక ప్రమాదాలను నివారించేందుకు వీలుంటుంది. విపరీతమైన రద్దీగా వుండే ఈ రోడ్డులో నిత్యం ఏదో ప్రమాదం సంభవిస్తూనే వుంది. ఈ పరిస్థితి నుంచి రోడ్డు విస్తరణ దోహద పడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. పదహారవ నెంబర్ జాతీయ రహదారిలో కొవ్వూరు నుంచి మళ్ళీ గామన్ వంతెనకు కలుస్తుంది. అక్కడ నుంచి కత్తిపూడి విశాఖపట్నం నుంచి కోల్‌కతా రోడ్డుగా అనుసంధానమవుతుంది. మరోవైపు కత్తిపూడి నుంచి కాకినాడ మీదుగా కృష్ణా జిల్లా పామర్రుకు 214వ నెంబర్ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణవల్ల పర్యాటకంగానూ, సామాజికంగా మరింతగా అభివృద్ధి సాధించనుంది. స్థానిక వ్యవసాయ ఉత్పత్తులు సులభతరంగా రవాణాతో పాటు, దేశంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానమయ్యే ప్రాంతంగా అభివృద్ధికి దోహదపడుతుంది. దీనికి తోడు 16వ నెంబర్ జాతీయ రహదారిలో అడుగడుగునా సీసీ కెమెరాలను అమరుస్తున్నారు. ప్రమాదాలకు తావులేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రోడ్ల విస్తరణ జరుగుతోంది.