ఆంధ్రప్రదేశ్‌

అవినీతి పాలనపై విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 11: ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద సభ్యత్వమున్న పార్టీ బీజేపీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విశాఖలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘటన్ పర్వ్-2019 పేరిట ఈ నెల 6 నుంచి వచ్చేనెల 11 వరకు బీజేపీ సభ్వత్య నమోదు నిర్వహిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంపై ఉన్న విశ్వాసంతో నేడు అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీజేపీలో చేరుతున్నారన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారు. కొత్తగా చేరిన వారితో సభ్యత్వం చేయిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయి నుంచి ఆయా పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, జెడ్‌పీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నవారిలో ఉన్నారన్నారు. మోదీ సిద్ధాంతాలపట్ల ఆకర్షితులై వస్తున్నారన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వం పట్ల పార్టీ క్యాడర్ విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. కర్ణాటకలో వారంతటవారే రాజకీయ సంక్షోభాన్ని సృష్టించుకున్నారని, తప్పితే, ఇందులో బీజేపీ పాత్ర ఏమాత్రం లేదని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గడచిన అయిదేళ్ళలో ఏపీలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై పోరాడుతుందని, ప్రజలపక్షాన ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరారు. శ్రీకాకుళం: విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి గురువారం వచ్చిన కన్నా సమక్షంలో రణస్థలం మండలం టీడీపీ మాజీ అధ్యక్షుడు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నడుకుదిటి ఈశ్వరరావు తన అనుచరులతో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో సుమారు 140 కార్యక్రమాలు అన్ని వర్గాల కోసం అమలు చేయడం ద్వారా భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్తున్నారన్నారు. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ మహిళా మోర్ఛా ఇన్‌ఛార్జ్ దగ్గుబాటి పురంధ్రీశ్వరి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కాంల ప్రభుత్వంగా ముద్రపడితే బీజేపీ పాలన స్కీమ్‌ల ప్రభుత్వంగా ప్రజల విశ్వాసాన్ని చూరగొందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేక హోదా గురించి పదే పదే మాట్లాడుతున్నారని, ఇకపై దాని గురించి వదిలేయాలని సూచించారు. గోదావరి, కృష్ణా జలాల నీటి పంపకం ఉభయ రాష్ట్రాలకు ఎప్పుడో జరిగిందని, ఇప్పుడు మిగుల జలాల గురించి మాత్రమే మాట్లాడాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ పాగా వేస్తుందన్నారు. బీజేపీ నేతలు విష్ణుకుమార్‌రాజు, కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు. విజయనగరం: ఈసారి దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వాన్ని రెట్టింపు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలనను అందించడంతోపాటు పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, దేశ రక్షణ వంటి వాటికి ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ప్రధాని చేపట్టిన సంస్కరణలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వైసీపీ నుంచి నాయకులు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.
చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ