ఆంధ్రప్రదేశ్‌

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన బుగ్గన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత తొలి బడ్టెట్‌ను ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను బుగ్గన తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,80,475 కోట్లు అని మంత్రి బుగ్గన వెల్లడించారు. మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు కాగా.. వడ్డీ చెల్లింపుల కోసం రూ.8,994 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే తాజా బడ్జెట్‌లో 19.32 శాతం పెరుగుదల ఉందని చెప్పారు. రెవెన్యూ లోటు రూ.1778.52, ద్రవ్యలోటు సుమారు రూ.35,260 కోట్లు, జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు సుమారు 3.3 శాతం ఉన్నట్లు తెలిపారు. మా ప్రభుత్వానికి మేనిఫెస్టోనే ప్రధాన నియమావళిగా ఉంటుంది అని బుగ్గన చెప్పారు.