ఆంధ్రప్రదేశ్‌

ఏపిపిఎస్‌సి పరీక్షలు ఆన్‌లైన్‌లో వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: ఆంధ్ర రాష్ట్రంలో గ్రూప్-1,2,3,4 సర్వీసు పరీక్షలను బహుళ ప్రశ్నాపత్రాలతో వేర్వేరు తేదీల్లో నిర్వహించడం సరికాదని, ఈ విధానాన్ని రద్దు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. 12 లక్షల మందికి ఒకే దఫా సివిల్ సర్వీసు పరీక్షలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ కూడా వేర్వేరుగా ప్రశ్నాపత్రాలు ఇవ్వడం లేదన్నారు. పరీక్ష విధానంలో సమతుల్యత లోపించి అభ్యర్ధులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఒక పరీక్ష రాసేటప్పుడు అందరి అభ్యర్థులకు ఒకేరకమైన పేపర్ ఉండే పరీక్ష రాసిన అభ్యర్థుల మెరిట్, విషయ పరిజ్ఞానం, ప్రతిభ కచ్చితంగా అంచనా వేయగలమన్నారు. వేర్వేరు ప్రశ్నపత్రాల వల్ల అంచనా వేయడం సంక్లిష్టమవుతుందన్నారు. వేర్వేరు తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ఈ జీవోను రద్దు చేయాలన్నారు. ఆన్‌లైన్ పరీక్ష విధానం గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ప్రతిబంధకంగా మారిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియం విద్యార్థులకు కంప్యూటర్ పరీక్ష విధానంపై అవగాహన లేదన్నారు. ఈ సర్వీసు ఉద్యోగాలు ముఖ్యమైనవని, నాలుగు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్లు ఇస్తున్నారన్నారు. పరీక్షలు, ఉద్యోగాల ఎంపికలో సంస్కరణలు అవసరమని, కాని ఇవి న్యాయ బద్ధంగా, ధర్మబద్ధంగా ఉండాలన్నారు.