ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా భూతప్పల ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 13: అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలోని భక్తరహళ్లి గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద శనివారం భూతప్పల ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆషాడ ఏకాదశి పురస్కరించుకుని మహిళలు ఉపవాస దీక్షతో బియ్యంపిండి, బెల్లంతో తయారు చేసిన సెలిమిడిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించుకుని ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి హారతి ఇచ్చారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూతప్పల ఉత్సవం నిర్వహించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్న రోగులు, సంతానం లేని దంపతులు మడిస్నానం ఆచరించి రహదారిపై బోర్లా పడుకోగా భూతప్పలు వారిపై నృత్యం చేస్తూ ముందుకు కదిలారు. భూతప్పల కాలి స్పర్శ తగిలితే రోగాలు నయమవుతాయని, సంతానం కలుగుతుందన్నది ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
చిత్రం... బోర్లా పడుకున్న భక్తులపై నాట్యం చేస్తూ ముందుకెళ్తున్న భూతప్పలు