ఆంధ్రప్రదేశ్‌

ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: ఇప్పటి వరకు పరోక్ష రాజకీయాల్లో ఉన్నా, బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని రాష్ట్రంలో పార్టీని, అధికారంలోకి తీసుకురావడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి వచ్చిన ఆయన విజయవాడలోని ది వెన్యూ కనె్వన్షన్ సెంటర్‌లో ఆదివారం బీజేపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో తెలుగుదేశంలో ఉండి టీడీపీ, బీజేపీ కలయికలో ప్రధాన పాత్ర వహించానన్నారు. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఏ కేంద్ర ప్రభుత్వం చేయని విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చి సహకరించిందన్నారు. ఏపీలో రానున్న రోజుల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకొస్తుందని, దీనికి తామంతా కృషి చేస్తామన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటేనే రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. నాలుగేళ్లు టీడీపీ, బీజేపీతో ఉన్న కారణంగానే రాష్ట్భ్రావృద్ధి జరిగిందని, చివరి ఏడాది తెగతెంపులు చేసుకోవడం వల్ల రాష్ట్భ్రావృద్ధి కుంటుపడిందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని, దీనికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సుజనా చౌదరి రాష్ట్భ్రావృద్ధికి కృషి చేశారన్నారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం బీజేపీతో తెగతెంపులు చేసుకుందన్నారు. మోదీ నాయకత్వంపై పూర్తిగా విశ్వసించిన సుజనా చౌదరి బీజేపీలో చేరడం అభినందనీయమన్నారు. అంతకుముందు సుజనా చౌదరి రాకతో పార్టీ కార్యకర్తలు పూలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ దేవఘర్, మాజీ మంత్రి కే హరిబాబు, బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మాజీ శాసన సభ్యులు విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్భ్రావృద్ధిలో బీజేపీ కీలకపాత్ర
విజయవాడ (ఎడ్యుకేషన్): రాష్ట్భ్రావృద్ధిలో బీజేపీ కీలకపాత్ర పోషిస్తోందని, మున్ముందు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురబోతుందని మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు వై సుజనాచౌదరి అన్నారు. విజయవాడలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్క్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక కోణాల్లో ఆలోచించిన తరువాతే బీజేపీలో చేరానని, నూతన భారతదేశం నిర్మాణం బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనేక కారణాలతో టీడీపీని వీడానని, త్వరలో కారణాలు వెల్లడిస్తానన్నారు.
దేశంలో ఏ రాష్ట్రానికి చేయ్యని కేంద్ర సాయం ఆంధ్రప్రదేశ్‌కు చేసిందన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగించాలని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఇప్ఫుడే ఆరోపణలు చేయడం సరైనా పద్ధతి కాదన్నారు. రాష్ట్రానికి బీజేపీ న్యాయం చేస్తుందని బల్లగుద్ధి చెప్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ పనిచేస్తోందని, ఐదేళ్ల పాలన అంశాలపై త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పలేనని విచారణ జరిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఏంపీగా మాత్రమే పార్టీలో ఉన్నానని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తానని సుజనా పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు పూర్తి కాలేదని, రాజ్యాంగం ప్రకారమే తాను టీడీపీని వీడి బీజేపీలో చేరానన్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని, బీజేపీలో టీడీపీ ఎమ్మేల్యేలు ఎవరు చేరుతున్నారో తనకు తెలియదని మాట దాటవేశారు. దేశంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధిని చూసి తాను బీజేపీలో చేరానన్నారు. బీజేపీపై తాను రాజకీయ విమర్శలు చేయలేదని, టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకే మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నాయకుల వలసలను ప్రోత్సహించడం బీజేపీ ఉద్దేశం కాదన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా ముందుకి వెళ్తున్నామన్నారు. బీజేపీలో చేరడానికి చంద్రబాబు సహకరించారనడంలో వాస్తవం లేదని, రాష్ట్రానికి భవిష్యత్తులో కూడా హోదా ఇవ్వలేమని పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, భవిష్యత్తులో బీజేపీ, టీడీపీతో కలుస్తుందో లేదో తాను చెప్పలేనన్నారు. నా ఫ్లెక్సీలలో ఎన్‌టిఆర్ ఫోటో ఎవరు పెట్టారోతనకు తెలియదని, పెడితే తప్ఫు ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పర్యటించాలని తనను పార్టీ ఆదేశించిందని, త్వరలో న్యూ ఇండియా పేరుతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని, పక్క రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత కారణంగా ప్రభుత్వాలు కూలిపోతున్నాయని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమస్యలను బీజేపీకి అపాదించడం సరికాదని సుజనా స్పష్టం చేశారు.
చిత్రం...విజయవాడలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి