ఆంధ్రప్రదేశ్‌

తెలుగుదేశం వర్గాల్లో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి బీజేపీలో చేరిన తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటన నిమిత్తం తొలిసారిగా ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు ఘన స్వాగతం లభించింది.
ఇదే సమయంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపాయి. నిన్నటి దాకా చంద్రబాబు కాళ్లు... రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్లు... అయితే కాళ్లు కాళ్లే వ్యక్తులు మాత్రమే తేడా... నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు, నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాఖ్యలు రాయలేని వాడు ట్విట్ చేస్తున్నాడు దౌర్భాగ్యం. టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరిని ఉద్దేశించి కేశినేని ట్విట్టర్‌లో ఘాటైన విమర్శలే చేశారు.
రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్‌లు అనవసరం. గుళ్లో కొబ్బరి చిప్పల దొంగలకు, సైకిల్ బెల్లుల దొంగలు, కాల్‌మనీ వాళ్లకి, సెక్స్ రాకెట్‌గాళ్లు, బ్రోకర్లు, పైరవీదారులకు రాజకీయాలు అవసరమని, తనకు అటువంటి రాజకీయాలు అవసరం లేదన్నారు. అంతకముందు శాసనమండలిలో టీడీపీ విప్ బుద్దా వెంకన్న పరోక్షంగా సుజనా చౌదరిని ఉద్దేశించి సంక్షోభం సమయంలో పార్టీ కోసం నాయకుడి కోసం పోరాడే వాడు కావాలి, ఇతర పార్టీ నేతలతో కల్సి కూల్చే వారు ప్రమాదకరం. తాను చనిపోయే వరకు బాబు కోసం సైనికునిలా పోరాడతానని అన్నారు. ఇదే సమయం ఎంపీ కేశినేనిపై కూడా బుద్ధా విరుచుపడ్టారు. ఆ నేపధ్యంలో ఎంపీ నాని ట్విటర్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
విజయవాడ టీడీపీలో రగులుతున్న విభేదాలు
విజయవాడ: రాష్ట్ర రాజధాని అమరావతి అయినా ప్రత్యక్షంగా పరోక్షంగా విజయవాడ నగరం కేంద్రంగా గడచిన ఐదేళ్లుగా రాజకీయ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో టీడీపీ ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు క్రమేణ రచ్చకెక్కుతున్నాయి. టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న సుదీర్ఘంగా కేశినేని భవన్ కేంద్రంగానే తన కార్యకలాపాలు సాగించారు. అయితే రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి బీజేపీలోకి వెళ్లడంతో కేశినేని, బుద్ధా మధ్య విమర్శలు జోరందుకున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని నానిపై బుద్ధా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి ఆయనకు రాజకీయ జన్మనిస్తే ఆయనను అనరాని మాటలు అని ఆ పార్టీని కూల్చారు. తాజాగా చంద్రబాబు ఆయనకు పునర్జన్మనిస్తే నేడు బాబు గురించి శల్యునిలా మాట్లాడుతున్నారని ట్విటర్‌లో బుద్ధా విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డిపై తాను ఎంతగా పోరాడుతున్నానో, నాని ఎంతగా పోరాడుతున్నారో జనానికి బాగా తెలుసని బుద్ధా ఎద్దేవా చేశారు.
దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆస్తులు ఎవరు కాజేశారో ప్రజలకు బాగా తెలుసని కూడా బుద్ధా పేర్కొన్నారు. ఒకే నెంబర్‌పై దొంగ పర్మిట్లతో పలు బస్సులు నడిపిన దొంగ ఎవరో తెలియందెవరికని కూడా వ్యాఖ్యానించారు. తాను చెప్పాల్సిన నిజాలు అనేకం ఉన్నాయి... వినే ధైర్యం ఎంపీ కేశినేనికి ఉందా అని కూడా ప్రశ్నించారు. 1997లో బస్సుల కొనుగోలుకు ఫైనాన్స్ కంపెనీ నుండి అప్పు చేసి, దొంగ రసీదులతో ఆ మొత్తాన్ని కాజేసిందెవరోనని కూడా అందరికీ తెలిసిందేనని బుద్ధా ట్విటర్‌లో పేర్కొన్నారు.