ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రపతి కోవింద్‌కు వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 15: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మూడురోజుల పర్యటన ముగించుకున్నరాష్ట్రపతి కోవింద్ దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు లభించింది. శ్రీహరికోట నుండి సోమవారం ఉదయం 9.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఘనస్వాగతం, వీడ్కోలు లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు బి.దుర్గాప్రసాద్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ భరత్ గుప్తా, టీటీడీ జేఈఓ బసంత్‌కుమార్, డీఐజీ గౌతమ్‌సవాంగ్, తిరుపతి సబ్‌కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్, మదనపల్లె సబ్‌కలెక్టర్ చేకూరి కీర్తి, రాయలసీమ రేంజ్ డీఐజీ క్రాంతిరాణా టాటా, అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌లు రాష్టప్రతికి ఘనస్వాగతం పలికారు. కాగా ముఖ్యమంత్రి శ్రీవారి ప్రతిమను రాష్టప్రతి దంపతులకు బహూకరించి వీడ్కోలు పలికారు. రాష్టప్రతి భారత వాయుసేన విమానంలో ఢిల్లీకి తిరుగుప్రయాణం అయ్యారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, గవర్నర్ నరసింహన్ జిల్లాకలెక్టర్, స్థానిక నేతలు, మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు.
చిత్రం... రేణిగుంట విమానాశ్రయంలో భారతరాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు
వీడ్కోలు పలుకుతున్న ముఖ్యమంత్రి జగన్ తదితరులు