ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమం, అభివృద్ధి వల్లే మళ్లీ అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 15: భారతదేశంలో గత ఐదేళ్ల బీజేపీ ప్రభుత్వ కాలంలో ప్రధాని మోదీ అన్నివర్గాలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల కారణంగానే తిరిగి దేశంలో తమపార్టీకి దేశంలో తిరుగులేని మెజార్టీని ప్రజలు అందించినట్లు బీజెపీ రాష్ట్రఅధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్ధానికంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో జాతీయ భావం కలిగిన ఒక సిద్దాంతం కలిగినపార్టీ ఏదైనా ఉందంటే అది తమపార్టీ అని తెలిపారు. తమపార్టీ దేశ అభివృద్దికోసం, అన్నివర్గాల ప్రజల అభివృద్దికోసం పనిచేస్తుందన్నారు. బీజెపీకి ఒక కులం, మతం లేదని అన్ని వర్గాలు సమానమేనని తెలిపారు. గతంలో తమపార్టీ ఒక అగ్రవర్ణపార్టీకి అనుకూలమైన పార్టీ అని కొన్ని రాజకీయపార్టీలు దుష్‌ప్రచారం చేశాయని అందులో వాస్తవం లేదని అన్నివర్గాల పేదలకు సంక్షేమ పధకాలు అందించే దిశగా తమప్రభుత్వం కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎస్‌సీ,ఎస్‌టీ, బీసీ,మైనార్టీల అభివృద్దికోసం కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. జన్‌ధన్‌కార్యక్రమంనుండి ఆయుష్ కార్యక్రమం వరకు సుమారు 136 సంక్షేమ పధకాలను కేంద్రప్రభుత్వం అమలుచేస్తూ అన్నివర్గాల అభివృద్దికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి వందల కోట్లరూపాయలను కేంద్రప్రభుత్వం ఇచ్చిందని అయితే గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం ఏమి ఇవ్వలేదనట్లుగా దుష్‌ప్రచారం చేయటంతోపాటు కేంద్రం ఇచ్చిన నగదుకుకూడా లెక్కలు చెప్పలేదని ఎద్దెవచేశారు. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలనలు తమ పధకాలుగా చంద్రబాబు చూపించుకుని లబ్దిపొందారని ఆయన విమర్శించారు. ఇలాంటి అడ్డదారుల్లో పరిపాలన సాగించటం వలనే చంద్రబాబు మోసమాటలను ప్రజలు అర్ధం చేసుకుని సాగనంపారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కూడా టీడీపీ కంటే అరాచకాలను అప్పుడే మొదలుపెట్టిందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేక అలివికాని సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతూ కాగితంమీద దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆపధకాలు ప్రజలకు ఆచరణలో చేరినప్పుడే ప్రజలు జగన్‌ను నమ్ముతారని ఆయన హితవుపలికారు. దేశ భవిష్యత్తు బాగుండాలన్న, రాష్ట్భ్రావృద్ది జరగాలన్న అది ఒక్క బీజెపీ ప్రభుత్వం మోదీతోటే సాధ్యమని తెలిపారు. విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, దారా సాంబయ్య, పీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
చిత్రం... ఒంగోలులో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న
బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ