ఆంధ్రప్రదేశ్‌

గన్నవరంలో సిఎం పతాకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఆగస్టు 15: భారతదేశానికి మువ్వనె్నల జాతీయ పతకాన్ని అందించిన పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా వాసి కావడం మనకు గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. సోమవారం మధ్యాహ్నం అనంతపురం నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన అక్కడ నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనం ఎదుట 100 అడుగుల ఎత్తులో నిరంతరం ఎగిరేలా ఎయిర్‌పోర్టు అథార్టీ ఏర్పాటు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం మాట్లాడుతూ 100 అడుగుల ఎత్తులో భారీ జాతీయ పతాకాన్ని స్థాపించిన ఎయిర్‌పోర్టు అధికారులను పేరు పేరునా అభినందించారు. మన జాతీయ పతాకాన్ని చూడగానే జాతీయ భావం పెరుగుతుందన్నారు. భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించడం శుభ పరిణామం అన్నారు. గన్నవరం ఎయిర్‌ర్టు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా రూపొందిన అనంతరం ఇక్కడ నుండే దేశ విదేశాలకు నేరుగా విమాన ప్రయాణం చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లాలంటే ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై వెళ్లి అక్కడ నుండి విమానాలు ఎక్కాల్సి వస్తోందన్నారు.

చిత్రం.. గన్నవరంలో జెండా వందనం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు