ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి, సంక్షేమంపై మండలిలో చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: మేధావులు, సీనియర్ రాజకీయ నేతలు ఉండే శాసనమండలిలో సంక్షేమం, అభివృద్ధిపై అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో గురువారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయన్నారు. శాసనసభలో వైకాపా సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండగా, శాసన మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులతో పాటు పీడీఎఫ్, బీజేపీ సభ్యులు కూడా ఉండటం వల్ల మరింత అర్థవంతంగా చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. కానీ మండలి సమావేశాలకు తగినంత ప్రచారం లభించడం లేదని, దీంతో ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాలకు వెళ్లిన సందర్భంలో తగిన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మండలి సభా కార్యక్రమాలను ప్రజలకు చేరేలా మీడియా సహకరించాలని కోరారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజ్యసభ తరహాలో మండలిలో చర్చలు జరుగుతాయని వివరించారు. విలువలు, సంప్రదాయాలకు నిలయమైన పెద్దల సభలో జరిగే కార్యక్రమ వివరాలు తగిన ప్రచారం కల్పించాలని కోరారు.