ఆంధ్రప్రదేశ్‌

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 18: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం గురువారం రాత్రి పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు కేంద్రం తెలియజేసింది. ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురియవచ్చని వివరించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం నిలబడితే నైరుతి రుతు పవనాలు బలపడతాయని, దీనివల్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని కేంద్రం పేర్కొంది. చేపలవేటకు వెళ్ళే మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవని వాతావరణ కేంద్రం తెలిపింది.