ఆంధ్రప్రదేశ్‌

మీరే పెద్ద క్రిమినల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: రాజకీయ స్వప్రయోజనాల కోసం సిఎం చంద్రబాబే ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొడుతున్నారని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ లేనంతగా బాబు దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్ల శాతం పెంచి, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలు ఎందుకు ఒప్పుకోరని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారశైలి చూస్తే క్రిమినల్ నెంబర్ వన్ అని ఎందుకనకూడదని ప్రశ్నించారు. సోమవారం లోటస్‌పాండ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆత్మస్తుతి, పరనింద పంథాలో తుని ఘటనను వైకాపాకు అంటగట్టడం దారుణమన్నారు. తాను తప్పులు చేసి వాటిని వేరేవాళ్లమీదకు నెట్టేందుకు ఇంతగా దిగజారుతారా? అని ప్రశ్నించారు. నెల జీతాలివ్వడానికి కష్టంగా ఉందని ఒకమాట, అమరావతిని చైనా సింగపూర్ జపాన్ దేశాలు నిర్మిస్తాయని మరోమాట చెబుతూనే, ప్రత్యేక విమానాల్లో లగ్జరీగా తిరుగుతున్నారని ఆగ్రహించారు. పరస్పర విరుద్ధ ప్రకటనలతోనే చంద్రబాబు గందరగోళంలో చిక్కుకున్నారన్నారు. ఎన్నికలకు ముందిచ్చిన మ్యానిఫెస్టోలో కాపులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి సాలీనా వెయ్యి కోట్లు ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై కమిషన్లు వేయడంవల్ల ప్రయోజనం లేదని, కేంద్రంపై వత్తిడి తెచ్చి తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలన్నారు. 22 నెలలు గడచినా తమకు న్యాయం జరగదనే నిరాశతో కాపులు ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరిట మాదిగలు, మాలల మధ్య తగదా పెట్టారని, రైతుల రుణ మాఫీకి హామీ ఇచ్చి నెరవేర్చలేదని, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి మాట నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. అందుకే చంద్రబాబును క్రిమినల్ నెంబర్ వన్ అనడంలో తప్పులేదన్నారు. చంద్రబాబుది క్రిమినల్ బుర్ర కనుకే, అనంతపురంలో బోయ కులాలను ఎస్టీల్లో చేరుస్తామని మాటిచ్చి తప్పారన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల భూములు సేకరించి ఎంపీ మురళీమోహన్, మంత్రి నారాయణ భూములు ఎందుకు ముట్టుకోలేదన్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే, అమరావతి నిర్మాణానికి వైకాపా వ్యతిరేకం అన్నట్టు ప్రచారం చేస్తున్నారన్నారు. కాల్‌మనీ ర్యాకెట్ గురించి మాట్లాడితే విజయవాడకు వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. కాపు గర్జన సమావేశానికి అడుగడుగునా ఆటంకాలు కల్పించారని, బస్సులివ్వకుండా చేశారన్నారు. చివరకు టీవీ చానళ్లు కాపు గర్జన దృశ్యాలను కవరేజ్ చేస్తే కుట్రలో భాగమంటున్నారన్నారు. 1988లో విజయవాడలో కాపునాడు సమావేశం పెడితే విజయవంతమైందన్నారు. తెదేపా మంత్రివర్గంలో పనిచేసిన హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో వంగవీటి రంగా హత్య వెనక అప్పటి తెదేపా పెద్దల హస్తం ఉందని రాసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. దుర్మార్గపు ఆలోచనలు, క్రిమినల్ బుద్ధి ఉన్నది చంద్రబాబుకేనన్నారు. సెల్‌ఫోన్ తానే తెచ్చానని చంద్రబాబు చెబుతుంటే ఖర్మకొద్దీ వినాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. వాస్తవాలను వక్రీకరించడంలో, అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు మించినవారు లేరన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై వత్తిడి తెచ్చి రిజర్వేషన్లు పెంచాలన్నారు. కలిసి రాకపోతే బిజెపి మంత్రివర్గం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? అని నిలదీశారు. కాపుల పోరాటం పూర్తిగా సమంజసమని, అందరం కలిసికట్టుగా అడుగులేస్తామని, విధ్వంసానికి పాల్పడే చర్యలకు దూరంగా ఉండాలని జగన్ కోరారు.

చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న జగన్