ఆంధ్రప్రదేశ్‌

అపార్ట్‌మెంట్‌లో కుప్పకూలిన లిఫ్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 15: విజయవాడ భవానీపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భవానీ టవర్స్‌లోని రెండు లిఫ్టులలో ఒక లిఫ్ట్‌కు సంబంధించి కేబుల్స్ తెగి ఐదో అంతస్తు నుంచి డభేల్‌మంటూ దిగువకు కూలిపోవటంతో అందులోనున్న 9మందిలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనుకోని రీతిలో జరిగిన ఈ కుదుపుకు నిలబడినవారంతా కుప్పకూలిపోవటంతో నడుం, కాళ్లకు తీవ్ర దెబ్బలు తగిలాయి. వీరంతా ప్రస్తుతం శిఖామణి సెంటర్‌లోని డాక్టర్ రాజేంద్ర పిడికిటి సిటీ ఆర్థోపెడిక్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెల్సిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స నందించాలంటూ అనంతపురం నుంచే వైద్యాధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరంలో ఆదివారం కాకుండా ప్రతి మంగళవారం వ్యాపార సంస్థలకు సెలవు.. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం ఇలా వరుసగా రెండు రోజులపాటు సెలవుదినాలు కావటంతో పుష్కర స్నానం చేసి అమరావతి, ఇతర పుణ్యక్షేత్రాల్లో గడపాలని నిశ్చయించుకుని వస్త్రాలు, ఫ్యాన్సీ, తదితర హోల్‌సేల్ వ్యాపారాలు చేసుకునే ఏడుగురు స్నేహితులు తమ కుటుంబ సభ్యులతో సహా మొత్తం 16 మంది కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం 5గంటలకు నగరానికి చేరుకున్నారు. స్థానిక గాంధీనగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ యోగేంద్రనాధ్ వీరందరికీ స్నేహితుడు కావటంతో వీరి బస కోసం భవానీపురంలోని భవానీ టవర్స్ బిల్డర్‌తో మాట్లాడి ఐదో అంతస్తులో ఖాళీగా వున్న ఓ ప్లాట్‌ను కుదిర్చి వాహనాలు ఏర్పాటు చేయించారు. రైలు దిగిన వారందరూ ఆ వాహనాల్లో నేరుగా అపార్ట్‌మెంట్‌కు చేరుకుని సమీపంలోని భవానీ ఘాట్‌లో స్నానం చేసేందుకై ఒక లిఫ్ట్‌లో 9మంది, పక్కన ఉన్న రెండో లిఫ్ట్‌లో 8మంది ఎక్కారు. 9మంది ఉన్న లిఫ్ట్ డోర్ పడిన కొన్ని క్షణాల్లోనే ఓవర్‌లోడ్ వల్ల కేబుల్స్ తెగటం, డభేల్‌మంటూ కిందపడటం జరిగిపోయాయి. దీంతో లిఫ్ట్‌లో నిలబడి వున్న వారంతా భయపడి కేకలు వేస్తూ కుప్పకూలిపోయారు. పక్క లిఫ్ట్‌లో దిగిన వారంతా వాచ్‌మెన్‌ను, అక్కడి వారిని పిలిచి లిఫ్ట్ తలుపులను తెరచి వారందరినీ సురక్షితంగా బైటకి తీసి అప్పటికే వెలుపల సిద్ధంగా వున్న వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు.