బిజినెస్

అన్న క్యాంటిన్లలో ఆహార సీలింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 18: అన్న క్యాంటీన్లలో ఆహారం సరఫరాపై ప్రభుత్వం అనధికార సీలింగ్ విధించింది. ఒక్కో క్యాంటీన్‌లో రోజుకు 800 మందికి మాత్రమే ఆహారం అందించాలని వౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు క్యాంటీన్ నిర్వాహకులు రోజుకు మొత్తంగా 800 మందికి మాత్రమే ఆహారం అందజేస్తున్నారు. ఇందులో ఉదయం 250 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 350 మందికి, రాత్రి 200 మందికి భోజనం అందచేస్తున్నారు. పేదలకు రూ.5కే ఆహారం అందచేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రాష్టవ్య్రాప్తంగా 200 అన్నా క్యాంటిన్లను ప్రారంభించింది. వీటి నిర్వహణ బాధ్యతను అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు అప్పగించింది. రూ.5కే ఉదయం అల్పాహారం, రూ.5కే ఉదయం భోజనం, రూ.5కే సాయంత్రం భోజనం ఈ క్యాంటీన్లలో అందజేస్తున్నారు. అల్పాహారం, రెండు పూటలా భోజనానికి రోజుకు ఒకొక్కరికి రూ.73 ఖర్చు అవుతుందని లెక్కించారు. అందులో రూ.15 భోజనం చేసే వ్యక్తి నుంచి వసూలు చేస్తారు. మిగిలిన రూ.58 ప్రభుత్వం చెల్లించే ఏర్పాటుచేసింది. తాగునీరు, క్యాంటిన్ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, విద్యుత్ బిల్లుల వ్యయం అంతా ఈ మొత్తంలోనే ఉంటుంది. దశల వారీగా ప్రారంభించిన ఈ క్యాంటీన్లకు ఆదరణ పెరిగింది. ప్రతీ రోజు పేదలు భోజనాలకు భారీగా బారులు తీరుతున్నారు. కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం పెట్టడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రోజూ ఒక్కో క్యాంటీన్‌లో 1000 మంది నుంచి 1200 మంది వరకు అల్పాహారం, భోజనం చేసేవారు. నిర్ణీత సమయానికి ఎంత మంది క్యూలో ఉన్నా అంతమందికీ ఆహారం అందచేసేవారు. ప్రధాన కూడళ్లలో క్యాంటిన్లు కిక్కిరిసి ఉండేవి. కాగా ఇటీవల పగ్గాలు చేపట్టిన కొత్త ప్రభుత్వం అన్నా క్యాంటిన్ల నిర్వహణపై సమీక్షించింది. ప్రతీ క్యాంటిన్‌లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కలిపి రోజుకు 800 మందికి మాత్రమే అందించాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 200 అన్నా క్యాంటిన్లలో రోజుకు 16 లక్షల మందికి భోజనం అందచేయాలని ఆదేశాలు రావడంతో నిర్వాహకులు ఆ మేరకు ఆదేశాలు అమలుచేస్తున్నారు. ఇదిలావుండగా క్యాంటిన్ల నిర్వాహకులకు తాజాగా మరో ఆదేశం అందినట్టు సమాచారం. ఇకపై రోజుకు 600 మందికి మాత్రమే భోజనాలు పెట్టాలని సూచించింది. ఉదయం అల్పాహారం 200 మందికి, మధ్యాహ్న భోజనం 300 మందికి, రాత్రి భోజనం 100 మందికి అందచేయాలని సూచించించినట్టు విశ్వసనీయ సమాచారం.