ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో చర్చిల దగ్గర పోలీసులు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: విశాఖలో చర్చిల దగ్గర పోలీసుల కాపలా ఎందుకు అంటూ బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ప్రశ్నించారు. రాష్ట్ర శాసన మండలిలో గురువారం స్పెషల్ మెన్షన్ కింద ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. విశాఖలోని చర్చిలపై, క్రైస్తవులపై దాడులు జరగవచ్చని విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు ఒక మహిళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వివిధ చర్చిల వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేశారన్నారు. ఇలా చేయడం ఆందోళనకు కారణమవుతోందన్నారు. విశాఖలో ఎన్నడూ మత ఘర్షణలు జరిగిన చరిత్ర లేదని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని చర్చిల వద్ద పోలీసులను ఉపసంహరించాలని కోరారు. కాగా ఈ నెల 4న విశాఖ నగర పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేస్తూ అక్కడి పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీపీలు తమ పరిధిలోని చర్చిలను నెలకొకసారి సందర్శించాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.