ఆంధ్రప్రదేశ్‌

ఎంసెట్ కౌనె్సలింగ్ ఎందుకు వాయిదా పడుతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: ఎంసెట్ కౌనె్సలింగ్ ఎందుకు వాయిదా పడుతోందంటూ టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. విద్యార్థుల తల్లితండ్రులను ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంశంపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ షరీఫ్ తిరస్కరించారు. సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించడంతో టీడీపీ సభ్యుడు ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఎంసెట్ కౌనె్సలింగ్ కార్యక్రమం మూడు సార్లు వాయిదా పడిందని గుర్తు చేశారు. దీనివల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సంగతి కూడా తేల్చలేదన్నారు. విద్యా వ్యవస్థపై నమ్మకం పోయేలా పరిస్థితి ఉందని, దీనిపై చర్చకు అనుమతించాలని కోరారు. చైర్మన్ నిరాకరిస్తూ, వేరే ఫార్మాట్‌లో రావాలని సూచించారు. ద్వారపురెడ్డి జగదీశ్వర రావు మాట్లాడుతూ కౌనె్సలింగ్ మూడుసార్లు వాయిదా పడటం వల్ల ఏం జరుగుతోందో తెలియడం లేదన్నారు. ఇంతకన్నా అత్యవసర పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. కౌనె్సలింగ్ కూడా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని రామకృష్ట వ్యాఖ్యానించారు. డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాట్లాడుతూ ఎంసెట్‌పై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేకపోవడంతో జాప్యం అవుతోందని ఆరోపించారు. విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజు సహా 100 శాతం ఫీజును ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీనిపై స్పష్టత లేకపోవడం వల్ల గందరగోళం నెలకొందన్నారు. విద్యార్థుల తల్లితండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంకో ఫార్మాట్‌లో చర్చించేందుకు వస్తామని తెలిపారు.