ఆంధ్రప్రదేశ్‌

నిరూపిస్తే... రాజీనామా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: సీఆర్‌డీఏ పరిధిలో స్థలాలు కేటాయించిన ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు జరగడం లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఆ మూడు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నట్లు నిరూపిస్తే, తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాష్ట్ర శాసన మండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని ప్రాంతంలో ప్రైవేట్ వర్సిటీలకు స్థలాల కేటాయింపు, షరతుల గురించి లక్ష్మణరావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పరిధిలో మూడు ప్రైవేట్ వర్సిటీలకు భూమలు కేటాయించారని, అవి వ్యాపారం చేసేవని, అంత తక్కువ ధరకు ఎందుకు భూములు కేటాయించారని ఆరోపించారు. పీడీఎఫ్ సభ్యుడు కత్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 14 ప్రభుత్వ వర్సిటీలు ఉన్నాయని, వాటిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వానికి ఆసక్తి లేదని విమర్శించారు. ప్రైవేట్ వర్సిటీలకు ఎక్కువ భూములు కేటాయించడం వల్ల పేదవారికి ఉచితంగా చదువు చెబుతున్నారా అని ప్రశ్నించారు. వ్యాపారం చేసే వర్సిటీలకు వందల ఎకరాలు ఎందుకు ఇచ్చారని పీడీఎఫ్ సభ్యుడు వై.శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. పీడీఎఫ్ సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇంజనీరింగ్ కోర్సులను నిర్వహించే వాటిని వర్సిటీలు ఎలా అంటారన్నారు. రాజధాని పరిధిలో కనీసం కేంద్రీయ పాఠశాల, నవోదయ పాఠశాల వంటి వాటికి స్థలాలు కేటాయించలేదని, వ్యాపార విద్యా సంస్థలకు కేటాయించారని ఆరోపించారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ బదులిస్తూ, విట్, అమృత, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలకు 200 ఎకరాల చొప్పున కేటాయించారని, 5సంవత్సరాల్లో 18 వేల మంది విద్యార్థులు ఉండాలన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి 25 ఎకరాలు ఇచ్చారని, అన్ని వర్సిటీలకు ఎకరా 50 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారన్నారు. వీటిల్లో ప్రవేశాలు నత్తనడకన జరుగుతున్నాయన్నారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు. మంత్రి సమాధానంపై లక్ష్మణరావు స్పందిస్తూ, ఈ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదని, ఉచితంగా పేద విద్యార్థులు చదివే పరిస్థితి లేదన్నారు. ఒక సంవత్సరం ఫీజు తగ్గించినా, మరుసటి సంవత్సరం నుంచి భారీగా ఫీజు వసూలు చేస్తున్నారని, దీని వల్ల విద్యార్థులు చదువు మానేసి వెళ్లిపోతున్నారన్నారు. ఈ వర్సిటీల్లో రిజర్వేషన్ అమలు చేయడం లేదని, అమలు జరుగుతున్నట్లైతే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఖర్చుల వివరాలపై వైకాపా సభ్యులు జంగా కృష్ణమూర్తి, గోవింద రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నపై మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ వైద్య సేవల్లో సమూల మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. సంస్కరణలకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఆటో యజమానులకు సమగ్ర బీమా పథకం అమలుపై టీడీపీ సభ్యుడు అశోక్ బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆటో మరమ్మతులు, ఫిట్‌నెస్ కోసం ఓనర్ కమ్ డ్రైవర్‌కు సంవత్సరానికి 10 వేల రూపాయలు చెల్లిస్తామన్నారు. గత ప్రభుత్వ హయంలో ఆటోలు, ట్రాక్టర్లకు జీవిత పన్ను గత ఏడాది జూన్‌లో విధించి, ఈ ఏడాది ఫిబ్రవరిలో పన్ను మినహాయింపు జీవో జారీ చేశారన్నారు. అప్పటికే పన్ను చెల్లించారన్నారు. ఎన్నికల సమయంలోనే ఓట్లు ఉన్న వారు గుర్తుకు వస్తారని ఆరోపించారు.