ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో పడకేసిన పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జూలై 19: రాష్ట్రంలో కొత్తప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పాలన పడకేసిందని మాజీ మంత్రులు శిద్దా రాఘవరావు, దేవినేని ఉమమాహేశ్వరరావు, కొత్తపల్లి జవహర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ ధ్వజమెత్తారు. జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయకమిటీ సమావేశం శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్ధన్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పరిపాలన చేతకాకపోవటం వలనే రాష్ట్రంలో పాలన అస్తవ్యస్థంగా తయారైందన్నారు. కనీస పరిజ్ఞానం కూడా లేకుండా, అధికారుల సలహాలు తీసుకోకుండా ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించటం వలనే ఈ పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. తమపార్టీ హయాంలో అమరావతి కళకళలాడుతుండేదని, ప్రస్తుతం అమరావతిలో కళ తప్పిందన్నారు. అధికారులు తప్ప ప్రజలు ఒక్కరూ కూడా అక్కడికి రాని పరిస్థితి నెలకొందన్నారు. తమపార్టీ హయాంలో 69శాతం పూర్తయిన పోలవరం నిర్మాణ పనులు పూర్తిగా మూలనపడ్డాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలిచిన ప్రపంచ బ్యాంకుతోపాటు అన్ని బ్యాంకులు కూడా వెనక్కి వెళ్లాయని స్పష్టం చేశారు.
ఇదేపరిస్ధితి కొనసాగితే రాష్ట్రం మరింత అంధకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలకే పరిమితం అయ్యారన్నారు. మంత్రులు, శాసనసభ్యులు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నా ముఖ్యమంత్రి మాట్లాడకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ టెండర్లల్లో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో విద్యుత్ టెండర్లల్లో అక్రమాలు జరిగితే వాటిని సరిచేసి నిజాయితీగా టెండర్లు పిలిచి కోతలు లేని రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను అమ్మే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని, ఈ విష సంస్కృతి మంచిది కాదన్నారు. 2014 నుండి 19 వరకు రాష్ట్రంలో ఎలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైకాపా నాయకులు, కార్యకర్తలు తమపార్టీ నేతలపై దాడులకు పాల్పడటమేకాకుండా హత్యలు కూడా చేయటం సరైందికాదన్నారు.