ఆంధ్రప్రదేశ్‌

మురిగిపోయిన కరవు ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఆంధ్రప్రదేశ్‌లో కరవుసహాయం పై ప్రతిపాదనలను మూడు నెలలు ఆలస్యంగా పంపినందున వాటిని తిరస్కరిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు కరవుసాయంపై వైఎస్సార్ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సభలో అడిగిన ప్రశ్నకు శుక్రవారం కేంద్ర మంత్రి బదులిచ్చారు. కరవుసహాయం చేసేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను నిర్ధేశించిందని అన్నారు. దానికి విరుద్ధంగా, క్షేత్ర స్థాయి పరశీలన జరపకుండా ఫిబ్రవరి 2019లో రబీ కరవుమండలాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అలాగే కరవువుసాయం కోసం ప్రభుత్వం మూడు నెలలు ఆలస్యంగా అంటే 2019 మే నెలలో కేంద్రానికి నివేదిక పంపిందని ఆయన అన్నారు. తదుపరి ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కరవుసాయం చేయాలని పంపిన ప్రతిపాదనలు మురిగిపోయినట్టేనని తోమర్ పేర్కొన్నారు. అందువల్లే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు ఆమోదం పొందలేదన్నారు.
ఆత్మా పథకం కింద రూ. 92 కోట్లు
ఆత్మా (అగ్రికల్చరల్ టెక్నాలాజికల్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) పథకం కింద 2014-15 నుంచి ఇప్పటి వరకు రమారమి రూ. 92 కోట్ల రూపాయులను కేంద్రం గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆత్మా పథకం అమలు కోసం ప్రతి రెండు గ్రామాలకు ఒక రైతు మిత్రను నియమించేందుకు తమ మంత్రిత్వశాఖ అనుమతించచినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఈ పథకం కింద రైతులను గుర్తించలేదని మంత్రి తెలిపారు. ప్రతి రైతు వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు తలపెట్టిన విస్తరణ సంస్కరణలను పల్లెపల్లెకు చేర్చడం ఆత్మా పథకం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటన్నారు.
ధాన్య సేకరణలో ప్రైవేట్‌కు అనుమతి
కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి ధాన్య సేకరణకు ప్రైవేట్ ఏజెన్సీలు, స్టాకిస్టులను అనుమతిస్తున్నట్లు ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయమంత్రి దానే్వ రావుసాహెబ్ దాదారావు వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆషా)ను అక్టోబరు 2018లో ప్రారంభించినట్లు చెప్పారు.