ఆంధ్రప్రదేశ్‌

మహిళలపై అత్యాచారాలు తగ్గుతున్నా మరింతగా ముందు జాగ్రత్త చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు తగ్గుతున్నప్పటికీ మరిన్ని ముందు జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నామని శాసనసభలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల్లో పామర్రు వైకాపా ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ మహిళల హెల్ప్‌లైన్లను బలోపేతం చేస్తున్నామన్నారు. మానవల అక్రమ రవాణాను నివారించేందుకు ఏలూరు, గుంటూరు, అనంతపురం నగరాల్లో ప్రత్యేక యూనిట్‌లను ఏర్పాటు చేశామన్నారు.
పాఠశాలల పిల్లలకు బరువులు తగ్గిస్తున్నాం: మంత్రి సురేష్
రాష్ట్రంలో పాఠశాల పిల్లలకు బ్యాగ్‌లు, పాఠ్య పుస్తకాల బరువులు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని శాసనసభ ప్రశ్నోత్తరాలలో టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవాని, అనగాని సత్యప్రసాద్ అడిగిన ప్రశ్నకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమాధానమిచ్చారు. పాఠశాల బ్యాగ్ బరువు కేంద్రం సూచించిన ప్రమాణాల కన్నా చాలా తక్కువగా ఉందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 20శాతం సిలబస్ తగ్గించామని అలాగే ఒకటవ, మూడవ శనివారాల్లో పాఠశాలలకు బ్యాగులను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా చేసామని ఆ రెండు రోజుల్లో పాఠ్యాంశేతర కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని ఆదిమూలపు చెప్పారు.